Prudhvi Raj- Pawan Kalyan: థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాడు. తన మాటల్లో పదును తగ్గింది. వైసీపీలో చేరినప్పుడు ఎవరినైనా సులువుగా విమర్శించిన అతడు ఇప్పుడు తనకు పశ్చాత్తాపం కలిగిందని చెబుతున్నాడు. అప్పుడు ఏదో మదంతో మాట్లాడానని వివరణ ఇస్తున్నాడు. వైసీపీ అండతో రెచ్చిపోయి మాట్లాడానని చెబుతున్నాడు. తన దుస్థితికి కారణమైన వారిని విడిచిపెట్టేది లేదని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. తనకు పదవి ఇచ్చినట్లే ఇచ్చి చివరకు లాక్కున్నారని వాపోతున్నాడు. అప్పుడు వైసీపీకి అనుకూలంగా మాట్లాడటంతో భక్తి చానల్ చైర్మన్ పదవి ఇచ్చి తరువాత లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో వైసీపీని ఓ ఉగ్రవాద సంస్థగా పోలుస్తున్నాడు. తనను కూడా ఓ ఉగ్రవాదిగానే పరిగణించాలని చెబుతున్నాడు. అప్పుడున్న పరిస్థితుల్లో విచ్చలవిడిగా మాట్లాడానని వివరణ ఇస్తున్నాడు. తనను అలా ప్రోత్సహించారని తనకు ఏదో టానిక్ ఎక్కించినట్లుగా అనిపించిందన్నాడు. ఇప్పుడు తనలో మార్పు వచ్చిందని సూచిస్తున్నాడు. వైసీపీపై విరుచుకుపడుతున్నాడు. వైసీపీ అంటే మోసమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తనకు పదవి ఇచ్చినా తరువాత కేసులో ఇరికించి అది లాగేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాడు.
Also Read: Telugu Heroine: ఆ క్రికెటర్ ప్రేమలో తెలుగు హీరోయిన్.. ఫోటో వైరల్ !
వైసీపీని ఉగ్రవాద సంస్థగా పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది. తాను కూడా ఓ ఉగ్రవాదిగానే భావించుకుంటూ తనలోని కర్కశత్వానికి తగిన మూల్యం చెల్లించుకున్నానని చెబుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో జనసేన విజయం సాధించడం ఖాయమని జోస్యం చెబుతున్నాడు. తాను వైసీపీ బస్సు ఎక్కనని జనసేనతోనే కలిసి నడుస్తానని దీమా వ్యక్తం చేస్తున్నాడు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృధ్వీ తన మనసులోని మాటలను వ్యక్తీకరించాడు. వైసీపీపై దుమ్మెత్తిపోస్తున్నాడు. అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు దూరం కావడంతో పరిస్థితి అధ్వానంగా మారిందని వాపోతున్నాడు. ఎవరికి కూడా తన లాంటి కష్టం రాకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

పృధ్వీ సినిమాల్లో కమెడియన్ గా చేసేటప్పుడు రోజుకు రూ. లక్షల్లో సంపాదించుకునే క్రమంలో ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేస్తున్నాడు. రాజకీయాల్లో చేరడంతో ఇష్టారాజ్యంగా మాట్లాడటంతో సినిమా అవకాశాలు కూడా పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్థిక పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారుతోంది. దీనిపై కూడా పృధ్వీ మథనపడుతున్నాడు. తన దుస్థితికి కారణమైన వారిపై కక్ష తీర్చుకుంటానని చెబుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో మాత్రం జనసేనకు మద్దతు ఇస్తానని భరోసా ఇస్తున్నాడు. కానీ పవన్ కల్యాణ్ అతడి మాటలు నమ్మే పరిస్థితిలో కనిపించడం లేదు. మొత్తానికి భవిష్యత్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
తాను పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసి ఉండాల్సింది కాదు. అప్పుడు వైసీపీ బలంతో మదం పట్టిన వాడిలా మాట్లాడానని చెబుతున్నాడు. అప్పడు అలా మాట్లాడాల్సింది కాదని వివరణ ఇస్తున్నాడు. వైసీపీలోని కొందరు నేతలు తనను హిప్నాటిజం చేశారని అందుకే అప్పుడు విచ్చలవిడిగా మాట్లాడి లేని చిక్కులు తెచ్చుకున్నట్లు వాపోతున్నాడు. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నానని బాధ పడుతున్నాడు.
Also Read:Anchor Manjusha: ఇంత అందం పెట్టుకుని ఎందుకు హీరోయిన్ కాలేదు ?.. పిక్స్ కేక !