Krithi Shetty: తెలుగు వెండితెర పై తన తళుకులు పరిచి తెలుగు సినీ లోకంలో నీరాజనాలు అందుకుంటున్న యుంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’. దర్శకనిర్మాతలు ఈ భామ కోసం పోటీ పడుతున్నారు. కృతి చెంతకు ప్రజెంట్ వరుస సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఈ భామ తాజాగా వైష్ణవ్ తేజ సరసన మరో సినిమా ఒప్పుకొంది. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే ‘కృతి శెట్టి’ లిస్ట్ ఆరు సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలు ఏమిటో చూద్దాం.

హీరో నాని సరసన ఒక సినిమా.
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తెలుగు
ది వారియర్
మాచర్ల నియోజవర్గం
గాలి జనార్దన్ రెడ్డి కొడుకు రెండో చిత్రం
రామ్ – బోయపాటి సినిమా
మొత్తానికి ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ కి బోలెడు డిమాండ్లు ఉన్నాయి. నటన పరంగా క్రేజ్ ఉంది. అద్భుతంగా డ్యాన్స్ కూడా చేస్తుంది. అందుకే, కృతి కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. ఆ మధ్య అయితే.. ఎన్టీఆర్, మహేష్ బాబు కొత్త సినిమాల్లో కూడా ‘కృతి శెట్టి’ నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ, అవి నిజం కాలేదు. కాకపోయినా ఆమెకు ఉన్న డిమాండ్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
Also Read: Venkatesh- Ravi Teja: వెంకటేష్ – రవితేజ కాంబినేషన్ లో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
అసలు సినిమా ఇండస్ట్రీలో సింగిల్ హిట్ చాలు, లైఫ్ మారిపోవడానికి. సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. అందుకే, నాలుగు ఆఫర్లు వచ్చే సరికి హీరోయిన్లు మాకు కోటి కావాలి, అవసరం అయితే రెండు కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేస్తారు. ‘ఉప్పెన’ తర్వాత ఈ బ్యూటీ కూడా భారీగా డిమాండ్ చేసి మరీ తీసుకుంటుంది.

నిజానికి ‘ఉప్పెన’ విడుదలకు ముందే కృతి శెట్టికి ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ స్థాయిలో కృతికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కృతి చేతిలో ఆరు చిత్రాలున్నాయి. అలాగే మరో మూడు సినిమాలకు సైన్ చేయడానికి ఒప్పుకుంది. ఇన్నీ సినిమాలు మరో ఏ హీరోయిన్ కి లేవు. దర్శకులంతా సినిమాలు ‘కృతి శెట్టి’ దగ్గరకే పోతే.. మిగిలిన హీరోయిన్ల పరిస్థితి ఏమిటో !!
Also Read:Basavatarakam Hospital: బాలయ్య బసవతారకం హాస్పిటల్ కు మరో అరుదైన రికార్డ్