https://oktelugu.com/

Sameera Reddy: ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి సంచలనం… న్యూడ్ గా స్నానం చేస్తున్న ఫోటో షేర్ చేసి బోల్డ్ బ్యూటీ!

Sameera Reddy: తెలుగులో సమీరా రెడ్డి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. ఎన్టీఆర్, చిరంజీవి టాప్ స్టార్స్ తో జతకట్టే ఛాన్స్ ఆమెకు దక్కింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సమీరా రెడ్డి 2002లో విడుదలైన మైనే దిల్ తుజ్ కో దియా చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. సల్మాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ డెబ్యూ మూవీగా ఇది తెరకెక్కింది. ఇక తెలుగులో సమీరా మొదటి చిత్రం నరసింహుడు. బి […]

Written By:
  • Shiva
  • , Updated On : October 23, 2022 / 11:39 AM IST
    Follow us on

    Sameera Reddy: తెలుగులో సమీరా రెడ్డి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. ఎన్టీఆర్, చిరంజీవి టాప్ స్టార్స్ తో జతకట్టే ఛాన్స్ ఆమెకు దక్కింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సమీరా రెడ్డి 2002లో విడుదలైన మైనే దిల్ తుజ్ కో దియా చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. సల్మాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ డెబ్యూ మూవీగా ఇది తెరకెక్కింది. ఇక తెలుగులో సమీరా మొదటి చిత్రం నరసింహుడు. బి గోపాల్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య నరసింహుడు విడుదలైంది. ఎన్టీఆర్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ గా నరసింహుడు నిలిచింది.

    Sameera Reddy

    కాంబినేషన్ కలిసి రాకపోయినా మరో మూవీలో ఎన్టీఆర్ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అశోక్ చిత్రంలో సమీరా రెడ్డి ఎన్టీఆర్ తో జతకట్టింది. ఆ మూవీ సైతం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్-సమీరా రెడ్డి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు చెలరేగాయి. అసలు ఎన్టీఆర్ ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్దమయ్యాడంటూ కథనాలు వెలువడ్డాయి. సమీరా రెడ్డి తెలుగు పరిశ్రమకు దూరం కావడానికి కారణం కూడా ఈ పుకార్లే అని సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం.

    చిరంజీవికి జంటగా సమీరారెడ్డి చేసిన జై చిరంజీవి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఒక ప్రక్క ఎఫైర్ రూమర్స్, మరో ప్రక్క వరుస ప్లాప్స్ సమీరా రెడ్డిని టాలీవుడ్ కి దూరం చేశాయి. అయితే ఆమె హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. కాగా 2014లో సమీరా వ్యాపారవేత్త అక్షయ్ వర్దే ను వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. మొదట ఒక అబ్బాయికి జన్మనిచ్చిన సమీరా రెడ్డి, రెండో సంతానంగా అమ్మాయిని కన్నారు.

    Sameera Reddy

    కాగా ఒక దశలో ఆమె బాడీ షేమింగ్ కి గురైనట్లు సమీరా వెల్లడించారు. తను బరువు పెరగడంతో కొందరు ఎగతాళి చేశారన్నారు. అలాంటి విమర్శకులకు చెక్ పెట్టేందుకు సమీరా రెడ్డి గర్భంతో కూడా ఫోటో షూట్ చేశారు. నిండు గర్భంతో బికీనీ ధరించి స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడారు. వెండి తెరకు దూరమైనా కానీ సోషల్ మీడియాలో ఫుల్ టచ్ లో ఉంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సమీరా ఏకంగా బాత్ టబ్ లో న్యూడ్ గా స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. సమీరా తెగింపు చూసిన జనాలు ఔరా అంటున్నారు.

    Tags