Samantha Treatment: హీరోయిన్ సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇందుకు ఆమె సినిమాలు వదిలేశారని. ఏడాది పాటు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయరంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై అధికారిక సమాచారం లేకపోవడంతో సమంత అభిమానుల్లో సందేహం ఉంది. అయితే ఆమె మిత్రుడు రోహిత్ బత్కర్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా సమంతకు ట్రీట్మెంట్ జరగనున్న మాట వాస్తవమే అని పరోక్షంగా తెలియజేశాడు.
రోహిత్ బత్కర్ సెలెబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్. సమంత వద్ద ఆయన కొన్నాళ్లుగా పని చేస్తున్నాడు. రోహిత్ తో సమంతకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. వారిది ప్రొఫెషనల్ పరిచయమైనా ఫ్రెండ్స్ గా మెలుగుతున్నారు. ఈ క్రమంలో సమంతకు అతడు విషెస్ చెప్పాడు. ఆమెకు చికిత్స జరిగే సమయంలో ఆ దేవుడు శక్తి, మనోధైర్యం ప్రసాదించాలి. పూర్తి ఆరోగ్యంగా సమంత కోలుకుని తిరిగి రావాలంటూ కామెంట్స్ చేశారు.
రోహిత్ బత్కర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ స్పష్టత ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత మయోసైటిస్ సోకిన విషయం వెల్లడించారు. కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఏడాది ప్రారంభం నుండి ఆమె సిటాడెల్, ఖుషి షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. దీంతో సమంత అమెరికా వెళ్లనున్నారు. చికిత్స కోసం ఆమె అక్కడే కొన్నాళ్ళు ఉండనున్నారు. సమంత వైద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని సమాచారం.
కాగా విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఖుషి చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. ఇక సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోనుంది. సిటాడెల్ ఇంటర్నేషనల్ యాక్షన్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత, వరుణ్ ధావన్ నటించారు. రాజ్ అండ్ డీకే నటించారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.