Hi Nanna Child Artist: చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. లోకం గురించి పూర్తిగా తెలియకముందే కెమెరా ముందు నటనలు నేర్చుకున్నవారు ఇప్పుడు స్టార్లుగా మారారు. అయితే చైల్డ్ ఆర్టిస్టుగా నటించాలంటే అందరికీ కుదరదు. కొందరు మాత్రమే సీన్ కు అనుగుణంగా నటిస్తారు. ఇప్పుడన్నీ శిక్షణ కేంద్రాలు వెలిశాక చాల మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే నటనపై మెళకువలు నేర్పిస్తున్నారు. అలా ఓ బేబీ ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ అనే మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో నానితో పాటు ఓ చిన్నారి నటిస్తోంది. ఈమె క్యూట్ గా ఉండడంతో ఎవరబ్బా అని అందరూ ఆరా తీస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఆమె కొత్త కావొచ్చు. కానీ హిందీలో పలు సినిమాల్లో నటించిన ఆమె గురించి..
దసరా బ్లాక్ బస్టర్ తరువాత నాని హీరోగా నటిస్తున్న మూవీ ‘హాయి నాన్న’. ఈ మూవీకి ఇటీవలే టైటిల్ ను ఖరారు చేశారు. పేరుకు తగ్గట్టే సినిమా కూడా తండ్రి పాత్రకు ప్రిఫరెన్స్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో నానితో పాటు మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. మూవీ టీం ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ భట్టి చూస్తే ఓ పాపకు తల్లి చినపోతుందని, ఆమెకు తండ్రే అన్ని చూసుకుంటాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు తండ్రి కూతుళ్ల మధ్య ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో కొత్తదనం ఉంటుందని మూవీ టీం చెబుతోంది.
ఈ మూవీలో నానితో పాటు నటించిన అమ్మాయి కియారా ఖన్నా. ఈమె ఈ సినిమాకు రాకముందు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. అంతేకాకుండా థాంక్ గాడ్, బందా సింగ్, బారాముల్లా, సాంబహదూర్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. దీంతో ఆమె ఫేమస్ అయింది. ఈ నేపథ్యంలో తన తల్లి శివాని జె ఖన్నా ఆమె ప్రతిభకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఇన్ స్ట్రాగ్రామ్ ను క్రియేట్ చేశారు. ఓ యూట్యూబ్ చానెల్ ను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కియారా ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాకు 328 ఫాలోవర్లు ఉన్నారు.
ఈమధ్య తెలుగు సినిమాలో ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంటున్నారు. అందుకే ఎన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా తెలుగు సినిమాల్లో ఆఫర్ రాగానే ఆమె తల్లి వెంటనే ఒప్పేసుకుంది. అంతేకాకుండా కియారకు ఈ ‘హాయ్ నాన్న’ సినిమాలో మెయిన్ రోల్ ఇచ్చారు. ఒక దశలో హీరోతో పాటే ఆమెకు గుర్తింపు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా తరువాత కియారా మరింత ఫేమస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.