Samantha Birthday: పుట్టినరోజు నాడు సమంత సంచలన నిర్ణయం..!

సమంత ఈ మేరకు ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది అంత శుభమే అని తన ఫోటో మీద కామెంట్ రాశారు. అది ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. ఈ పుట్టినరోజు నాడు ఏడాది అంతా ఆనందంగా గడపాలని, అంతే మంచి జరుగుతుందని సమంత చెప్పకనే చెప్పారు.

Written By: Shiva, Updated On : April 28, 2023 2:10 pm
Follow us on

Samantha: హీరోయిన్ సమంత జన్మదినం నేడు. 1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత 36వ ఏట అడుగు పెట్టారు. సమంత జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, ప్రముఖులు సమంతకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. నాగ చైతన్యతో విడిపోయాక సమంతకు ఇది రెండో పుట్టినరోజు. 2021 అక్టోబర్ నెలలో సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. గత ఏడాది సమంత మనస్ఫూర్తిగా పుట్టినరోజు జరుపుకోలేక పోయారు. విడాకుల డిప్రెషన్ లో ఉన్న సమంత ఈ స్టార్ లేడీ వేడుకలకు దూరంగా ఉన్నారు.

అలాగే గత ఏడాది చివర్లో సమంత అనారోగ్యం బారిన పడ్డారు. ఆమెకు అరుదైన మయోసైటిస్ సోకింది. నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యారు. చికిత్స అనంతరం కోలుకున్నారు. రెండేళ్లుగా ఆమె జీవితాన్ని వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టాయి. అయితే సమంత స్ట్రాంగ్ ఉమన్. వాటన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొంటుంది. కెరీర్లో ముందుకు వెళుతుంది. ఈ పుట్టినరోజుకు ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సమంత ఈ మేరకు ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది అంత శుభమే అని తన ఫోటో మీద కామెంట్ రాశారు. అది ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. ఈ పుట్టినరోజు నాడు ఏడాది అంతా ఆనందంగా గడపాలని, అంతే మంచి జరుగుతుందని సమంత చెప్పకనే చెప్పారు. సమంత పోస్ట్ ఆమె అభిమానులను ఆనందానికి గురి చేస్తుంది. కాగా సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం. ఇది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అంతా కర్మఫలం. మా ప్రయత్నం మేము చేశాం. రిజల్ట్ నెగిటివ్ గా వచ్చిందని సమంత వాపోయారు.

ప్రస్తుతం ఆమె ఖుషి చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. గతంలో సమంత-విజయ్ దేవరకొండ మహానటి చిత్రంలో నటించారు. ఖుషితో పాటు సిటాడెల్ సిరీస్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. చిత్రీకరణ దశలో ఉంది. రాజ్ అండ్ డీకే నటిస్తున్నారు.