Ramoji Rao Vs Undavalli: మార్గదర్శి లో రామోజీ ద్విపాత్రాభినయం: సంచలన నిజం లీక్ చేసిన ఉండవల్లి

డిపాజిట్లు స్వీకరించే క్రమంలో, చెల్లించే సమయంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ రైటర్ గా సంతకాలు చేసిన పత్రాలను కోర్టుకు అరుణ్ కుమార్ సమర్పించారు. " గత విచారణ సమయంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీ వాలా తో కూడిన ధర్మాసనం ఒక చోట హెచ్ యూ ఎఫ్ గా,మరో చోట ప్రొప్రైటర్ గా క్లెయిమ్ చేసుకున్న విధానాన్ని ప్రశ్నించారని" ఈ విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Written By: Bhaskar, Updated On : April 28, 2023 2:11 pm
Follow us on

Ramoji Rao Vs Undavalli: మార్గదర్శి విషయంలో రామోజీరావును ఏపీ ముఖ్యమంత్రి ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇక సుప్రీం కోర్టులో అయితే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చుక్కలు చూపిస్తున్నాడు. జగన్ ప్రభుత్వం వల్ల కానిది చూపిస్తున్నాడు. మార్గదర్శికి సంబంధించి డిపాజిట్ దారుల నుంచి సేకరించిన మొత్తాన్ని ఎటువంటి మార్గాలకు మళ్ళించారో పక్కా రుజువులతో సుప్రీంకోర్టు తీసుకెళ్లారు. అంతే కాదు వీటి కి సంబంధించి అదనపు డాక్యుమెంట్లు కూడా జత చేశారు.

ఏం బయటపెట్టారంటే

డిపాజిట్లు స్వీకరించే క్రమంలో, చెల్లించే సమయంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ రైటర్ గా సంతకాలు చేసిన పత్రాలను కోర్టుకు అరుణ్ కుమార్ సమర్పించారు. ” గత విచారణ సమయంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీ వాలా తో కూడిన ధర్మాసనం ఒక చోట హెచ్ యూ ఎఫ్ గా,మరో చోట ప్రొప్రైటర్ గా క్లెయిమ్ చేసుకున్న విధానాన్ని ప్రశ్నించారని” ఈ విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఉండవల్లి కుటుంబ సభ్యుల్లో కొంతమంది వారు సంపాదించిన సొమ్మును మార్గదర్శి లో పెట్టుబడి పెట్టారు. గత 16 సంవత్సరాలుగా వారు తమ డిపాజిట్లను రెన్యువల్ చేస్తూనే ఉన్నారు. 2006లో మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్లు లక్ష కన్నా తక్కువ ఉన్నాయని రెన్యువల్ చేసుకోలేదు. దీనికి సంబంధించి మార్గదర్శి జారీ చేసిన డిపాజిట్ బాండ్ లలో హెచ్ యూ ఎఫ్ కర్త హోదా లో, చెక్ పైన మార్గదర్శి ఫైనాన్స్ తరఫున ప్రొప్రైటర్ గా రామోజీరావు సంతకం చేయడం విశేషం.

అర్బీఐ యాక్ట్ ప్రకారం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1934 సెక్షన్ 45 ఎస్ ప్రకారం 1997 తర్వాత ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం చట్ట విరుద్ధం. ఈ క్రమంలో మార్గదర్శి నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించింది.. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల అక్రమాలను ఈనాడు బహిర్గతం చేసింది.. వాస్తవానికి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు రిజిస్టర్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యాపారానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందాయి కూడా. అయితే తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నాయనే అక్కసుతో మార్గదర్శి ఈ బ్యాంకులను మూసివేయాలని అప్పటి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే అప్పటి 45 బ్యాంకుల మొత్తం డిపాజిట్లు విలువ 630 కోట్లు.. అయితే ఈ బ్యాంకుల వల్ల తన వ్యాపారం సజావుగా సాగడం లేదనే తలంపుతో మార్గదర్శి అనేక రకాల కుయుక్తులు పన్నింది.

రిజిస్టర్ కాలేదు

మార్గదర్శి ఇంతవరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిజిస్టర్ కాలేదు. ఈ లెక్కన చూస్తే దేశంలో ఎక్కడా కూడా రిజిస్టర్ కాలేదు. ఆన్ ఇన్ కార్పొరేటేడ్ బాడీగా మార్గదర్శి 1997 నుంచి ఎవరి నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా నిషేధం ఉంది. అయితే ఆ నిబంధనలు ఉల్లంఘించి మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించింది. ఇలా చేసినందుకు గానూ ఆ సంస్థకు సంబంధించిన యజమానులు గరిష్టంగా రెండు సంవత్సరాలు పాటు జైలు శిక్షకు అర్హులవుతారు.. ఇక 45 అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు డిపాజిట్లు మొత్తం 630 కోట్లు అయితే.. మార్గదర్శి ఏకంగా 2,600 కోట్లు సేకరించింది. ఇక 2006 మార్చి 31 నాటికి 1400 కోట్ల నష్టంలో మార్గదర్శి ఉండగా.. ఆ ఏడాది తర్వాత రామోజీరావు హెచ్ యు ఎఫ్ నష్టం మొత్తం 1800 కోట్లకు చేరుకుంది.. అయితే ఈ నష్టాలను రామోజీరావు కేవలం టెక్నికల్ లాస్ గా చూపించడం విశేషం.

ఎక్కడా చూపించలేదు

ఒక సంస్థకు సంబంధించి అనుకోకుండా నష్టం వాటిల్లితే.. అది కచ్చితంగా జన బహుల్యానికి చూపించాల్సి ఉంటుంది. కానీ మార్గదర్శి తన ఆర్థిక స్థితిపై ఏ వార్తాపత్రికలోనూ ప్రచురించలేదు. డిపాజిటర్లకు పంపిణీ చేయలేదు. వ్యాపారం మొత్తం గుట్టుగా సాగిపోయింది. ఆశ్చర్యకరంగా మార్గదర్శి ఫైనాన్సర్స్ కు ఉద్దేశపూర్వకంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లిమిటెడ్ విభాగం ద్వారా డిపాజిట్లు సేకరిస్తున్నారని అభిప్రాయం కలిగించేందుకు కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.