Allari Naresh Health: అల్లరి నరేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం..ఏం జరిగిందంటే?

విజయ్ కనకమేడల డైరెక్షన్లో వస్తున్న ‘ఉగ్రం’ ను సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్నారు. శ్రీచరన్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కు జోడిగా మీర్జా మీనన్ నటిస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : April 28, 2023 2:15 pm
Follow us on

Allari Naresh Health: కామెడీ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. మొన్నటి వరకు యాక్షన్ హీరోల సినిమాల కంటే అల్లరి నరేష్ సినిమాలే ఎక్కువగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆయన స్టైల్ మార్చేశారు. కామెడీకి పులిస్టాప్ పెట్టి యాక్షన్ లోకి దిగారు. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో నరేష్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడడంతో అప్పటి నుంచి ఆయనతో యాక్షన్ సినిమాలు తీసేందుకు డైరెక్టర్లు ముందుకు వస్తున్నారు. అంతకుముందు ఈయన నటించిన ‘నాంది’ సినిమా మంచి పేరు తెచ్చుకోవడంతో ఇదే తరహాలో నరేష్ ‘ఉగ్రం’ తో త్వరలో వెండితెరపైకి రాబోతున్నాడు. ఈ సినిమా కోసం నరేష్ బాగానే కష్డపడినట్లు తెలుస్తోంది. ఓ సీన్ కోసం ఆయన ఏకంగా 500 సిగరెట్లు తాగినట్లు తెలుస్తోంది.

విజయ్ కనకమేడల డైరెక్షన్లో వస్తున్న ‘ఉగ్రం’ ను సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్నారు. శ్రీచరన్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కు జోడిగా మీర్జా మీనన్ నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మే 5న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉగ్రం కు సంబంధించిన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో నరేష్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

ఉగ్రం మొత్తం యాక్షన్ మూవీ. ఇందులో నరేష్ కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తారు. ఆయన ఇటీవల నటించిన నాంది, మిరేడ్ పల్లి నియోజకవర్గం సినిమాల్లో సాధారణ వ్యక్తిగా కనిపించారు. కానీ ఉగ్రంలో నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా పై నరేష్ తో పాటు టెక్నీషియన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్ పెట్టుకున్నారు.

ఇక ఈ మూవీ గురించి ఓ సెన్సెషనల్ న్యూస్ బయటకొచ్చింది. ఇందులో నరేష్ ఓ భారీ ఫైట్ చేయనున్నారు. ఆ ఫైట్ ను దాదాపు నాలుగు రోజుల పాటు చిత్రీకరించారట. అయితే ఈ ఫైట్లో నరేష్ స్మోక్ చేస్తూ కనిపించాలి. అలా స్మోక్ చేసే క్రమంలో సీన్స్ రీపీట్ చేసినప్పుడల్లా సిగరేట్ తాగాల్సి వచ్చింది. అలా నాలుగురోజుల పాటు మొత్తం 500 సిగరెట్లు తాగాడట.

పదుల కొద్ది సిగరేట్లు తాగితేనే ఆయాసం వస్తుంది. నరేష్ అలా 500 సిగరెట్ల తాగడం వల్ల దగ్గు, ఆయాసం వచ్చి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందట. ఈ విషయాన్ని ఆయన సినిమా ప్రమోషన్లో భాగంగా వేదికపై చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ఈ సినిమాకోసం నరేష్ బాగా కష్టపడ్డారని అంతా అనుకుంటున్నారు. మరి నరేష్ కష్టానికి ఉగ్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి..