Samantha: సమంత మయోసైటిస్ అనే మహమ్మారి బారిన పడ్డారు. ఈ అరుదైన వ్యాధి ఆమెకు ఎందుకు సోకిందో అర్థం కావడం లేదు. సమంత అభిమానులను ఈ వార్త కలచి వేసింది. ఆమెకు ఏమవుతుందో అనే ఆందోళనలు రేకెత్తించింది. చిన్న పిల్లలు లేదా వయోవృద్ధులకు మాత్రమే ఈ మయోసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది 35 ఏళ్ల సమంతకు సోకడం నిజంగా దురదృష్టకరం. దీనికి ఆమె చేసిన కొన్ని పొరపాట్లు కారణం అంటున్నారు. మితిమీరిన వ్యాయామం సమంతను అనారోగ్యంపాలు చేసింది అంటున్నారు. జీరో సైజు ప్యాక్ కోసం సమంత ప్రతి రోజూ గంటల తరబడి వ్యాయామం చేస్తారు. పెద్ద పెద్ద బరువులు ఎత్తుతారు.

ఈ పరిణామం సమంత కండరాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఆమెకు మయోసైటిస్ సోకడానికి దారితీసిందన్న వాదన ఉంది. అలాగే విడాకుల కారణంగా సమంత ఎదుర్కొన్న మానసిక వేదన, డిప్రెషన్ కండిషన్స్ కారణం కావచ్చని అంటున్నారు. కారణం ఏదైనా సమంతకు రాకూడని వ్యాధి వచ్చింది. మయోసైటిస్ సోకిన తర్వాత మొదటిసారి సమంత ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో సమంత చేసిన కొన్ని కామెంట్స్ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆరోగ్యం గురించి అడగ్గానే సమంతకు కన్నీరు ఆగలేదు. ఒక్కోరోజు అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది అన్నారు. పత్రికల్లో వచ్చినంత దుర్భర స్థితిలో నేను లేనని సమంత అన్నప్పటికీ ఆమె చేసిన ఒక కామెంట్ భయపెడుతుంది. వార్తా కథనాలలో రాసినట్లు నేను చనిపోవడం లేదు. అలా అని ఇది చిన్న సమస్య కూడా కాదు. ప్రస్తుతానికి నేను బాగున్నాను, చనిపోలేదు. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేం, అన్నారు. ప్రస్తుతానికి ఓకే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేనని ఆమె అనడం వెనుక ఆంతర్యం అర్థం కాలేదు. అదే సమయంలో ఈ రుగ్మత నుండి బయటపడతానో లేదో చెప్పలేనని పరోక్షంగా చెప్పారా? అనే సందేహం కలుగుతుంది.

మయోసైటిస్ వ్యాధిలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో సమంతకు సోకినది ఏ తరహా మయోసైటిస్ అనేది తెలియదు. సమంత మాత్రం పోరాడి ఆ మహమ్మారి నుండి బయటపడతానన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సమంతను అభిమానించే లక్షలాది మంది కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇక మరో రెండు రోజుల్లో సమంత నటించిన యశోద విడుదల కానుంది. నవంబర్ 11న వరల్డ్ వైడ్ 5 భాషల్లో మూవీ విడుదల కానుంది. అనారోగ్యంలో కూడా సమంత ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.