Amitabh bachchan : ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన దివంగత తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్‌ను గుర్తుగా ఒక అరుదైన బెంచ్ ను తయారు చేయించారు. తండ్రి గౌరవార్థం నిర్మించిన కొత్త బెంచ్‌ను షేర్ చేశారు. ఆ పిక్ లు వైరల్ అయ్యాయి. అమితాబ్ తన బ్లాగ్‌లో ‘పుస్తకం ఆకారంలో ఉన్న బెంచ్’ చిత్రాన్ని పోస్ట్ చేసి అది పోలాండ్‌లో తయారు చేయబడిందని వెల్లడించారు. ఈ రోజు తన నివాసం జల్సాలో ఈ పుస్తక బెంచ్‌ను ఏర్పాటు చేసినట్లు అమితాబ్ తెలిపారు.

అమితాబ్ ఈ పుస్తక బెంచ్ ఫొటోలను రిలీజ్ చేస్తూ “పోలాండ్‌లోని వ్రోక్లాలో రాతితో చేసిన ఒక బెంచ్ పుస్తకం ఆకారంలో అద్భుతంగా తయారు చేశారు. ఇది అత్యంత ప్రత్యేకమైనది.. ఒక టన్ను బరువు ఉంటుంది. పోలాండ్ నుండి తెప్పించబడింది. ఇండియా ఇన్ వ్రోక్లా, శ్రీ కార్తికేయ జోహ్రీ, వ్రోక్లాలో బాబూజీ ఎల్ఫ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సాహాయపడ్డారు. తండ్రి గౌరవార్థం హరివంశ్ పేరిట ఆధునిక హిందీ సాహిత్య అధ్యయనానికి పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించేందుకు కృషి చేస్తాను’ అంటూ రాసుకొచ్చాడు.
తండ్రిని స్మరించుకుంటూ ఈ రోజు జల్సాలోని పచ్చిక బయళ్లలో ఆ బెంచ్‌ను ఏర్పాటు చేయడం ఎంత శుభదాయకం.. ఆయన చేతులు , మనస్సు , శరీరంలో నేను నన్ను నేను చూసుకుంటున్నాను. నిస్వార్థమైన ఆయన మనసును తాకినట్టు ఉంది అంటూ అమితాబ్ తండ్రి గురించి గొప్పగా చెప్పుకున్నాడు.
అమితాబ్ బచ్చన్ ఆదివారం తన ఇంటి వెలుపల ఉన్న అభిమానులను కలుసుకున్నాడు. తన ఇంటికి హాజరైన కౌన్సెల్ జనరల్ కార్తికేయ జోహ్రీకి కూడా ఈ అరుదైన పుస్తక బెంచ్ ను చూపించాడు. “ఆదివారం జల్సా గేట్‌ల వద్ద శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు.. తీసుకురావాల్సిన బెంచ్‌ను ఏర్పాటు చేసిన న్యాయవాది జనరల్ కార్తికేయ జోహ్రీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు” అంటూ అమితాబ్ పేర్కొన్నాడు.