CSK Vs RCB: ఐపీఎల్ లో భాగంగా చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) శుక్రవారం తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(51), ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్లు గా నిలిచారు. నూర్ అహ్మద్ 3/36, మతీష పతిరణ 3/36 తో ఆకట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు 45 పరుగుల వద్ద ఓపెనర్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అతడు అవుట్ అయిన విధానం చూస్తే కళ్ళు చెదిరిపోవడం గ్యారంటీ.. ఎందుకంటే క్రికెట్ల వెనుక ఉన్న మహేంద్ర సింగ్ ధోని ఆ స్థాయిలో స్టంప్ అవుట్ చేశారు కాబట్టి.
Also Read: ఐపీఎల్ సోషల్ బజ్: తలైవా ధోని కంటే కింగ్ కోహ్లీనే తోపు
వెంట్రుక వాసి దూరంలోనే..
వికెట్ల వెనుక ధోని అత్యంత చురుకుగా ఉంటాడు. ప్రస్తుతం ధోనీ వయసు 40+ సంవత్సరాలు అయినప్పటికీ అతనిలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. పైగా యువకులకు మించి అతడు కీపింగ్ చేస్తున్నాడు. అందువల్లే ఇటీవల చెన్నై జట్టు మేనేజ్మెంట్ పై ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు..” ఐపీఎల్ కు రిటైర్మెంట్ గురించి ఇప్పుడే చెప్పలేను గాని.. నేను వీల్ చైర్ మీద ఉన్న నన్ను తీసుకొచ్చి ఆడిస్తారని” చెన్నై జట్టు మేనేజ్మెంట్ పై ధోని సరదా వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ధోని వయసు 43 సంవత్సరాలు.. ఎప్పటికీ ఐపీఎల్లో అతడు ఉత్తమమైన వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని తిరుగులేని కీపింగ్ చేశాడు. ముంబై జట్టు తాత్కాలిక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను స్టంప్ అవుట్ చేశాడు. 0.14 సెకండ్ల వ్యవధిలోనే స్టంప్ లను గిరాటేసి సూర్య కుమార్ యాదవ్ ను పెవిలియన్ పంపించాడు. ధోని చేసిన స్టంప్ అవుట్ చేసి సూర్య కుమార్ యాదవ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇక ప్రస్తుతం బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఫిల్ సాల్ట్ ను కూడా ధోని అదే విధంగా అవుట్ చేశాడు. 0.15 సెకండ్లకే సాల్ట్ ను వెనక్కి పంపించాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో షాట్ కొట్టడానికి సాల్ట్ ప్రయత్నించాడు. కాస్త కుడికాలును పైకి లేపాడు. అంతే ధోని ఆ బంతిని అందుకుని.. కాంతి కంటే ఎక్కువ వేగంతో వికెట్లను గిరాటేశాడు. దీంతో సాల్ట్ థర్డ్ అంపైర్ రివ్యూ కోరాడు. ఆ రివ్యూలో సాల్ట్ కాలును పైకి లేపినట్టు కనిపించింది. అది కూడా వెంట్రుకవాసి దూరంతోనే పైకి లేపినట్టు కనిపించడంతో థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. 43 సంవత్సరాల వయసులో తనను కాంతి వేగం కంటే ఎక్కువ స్పీడ్ తో అవుట్ చేసిన విధానాన్ని చూసి సాల్ట్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో సాల్ట్ 16 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 32 పరుగులు చేశాడు.
ಏನ್ Stumping ಗುರುವೇ.!
ವೀಕ್ಷಿಸಿ | TATA IPL 2025 | #CSKvRCB | LIVE NOW | ನಿಮ್ಮ JioHotstar & Star Sports ಕನ್ನಡದಲ್ಲಿ.#IPLOnJioStar #IPL2025 #TATAIPL pic.twitter.com/ScBr4Qlzlb
— Star Sports Kannada (@StarSportsKan) March 28, 2025