కేసీఆర్ పై ఆర్కే మౌనం.. రామోజీ ఎటాక్

రాజకీయం ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో తెలియదు.. మీడియాల ప్రాధాన్యాలు ఎప్పుడు ఎందుకు మారుతాయో అస్సలు అర్థం కాదు.. తమకు ఎప్పుడు ఎంత అవసరం అవుతారనుకుంటే ప్రభుత్వాలను అంతగా మీడియా మోస్తుందంటారు. ఎప్పుడైతే అవసరం పడదో అప్పుడు లోపాలు ఎత్తిచూపడం ప్రారంభిస్తుందంటారు. Also Read: తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా? ఇప్పుడు తెలుగు మీడియా పరిస్థితి అలానే ఉంది. తెలంగాణలో గద్దెనెక్కగానే కేసీఆర్ అప్పటిదాకా విచ్చలవిడిగా చెలరేగిపోతున్న మీడియాకు కళ్లెం వేశారు. టీవీ9, ఏబీఎన్ చానెళ్లను […]

Written By: NARESH, Updated On : July 25, 2020 10:09 am
Follow us on


రాజకీయం ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో తెలియదు.. మీడియాల ప్రాధాన్యాలు ఎప్పుడు ఎందుకు మారుతాయో అస్సలు అర్థం కాదు.. తమకు ఎప్పుడు ఎంత అవసరం అవుతారనుకుంటే ప్రభుత్వాలను అంతగా మీడియా మోస్తుందంటారు. ఎప్పుడైతే అవసరం పడదో అప్పుడు లోపాలు ఎత్తిచూపడం ప్రారంభిస్తుందంటారు.

Also Read: తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

ఇప్పుడు తెలుగు మీడియా పరిస్థితి అలానే ఉంది. తెలంగాణలో గద్దెనెక్కగానే కేసీఆర్ అప్పటిదాకా విచ్చలవిడిగా చెలరేగిపోతున్న మీడియాకు కళ్లెం వేశారు. టీవీ9, ఏబీఎన్ చానెళ్లను నిషేధించి అన్ని మీడియాలను దారికి తెచ్చారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ ను కాచుకుంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై విరుచుకుపడ్డాయి మీడియా సంస్థలు. ఒకానొక దశలో టీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ గెలుస్తుందన్నంత ప్రచారం చేశాయి. కానీ టీఆర్ఎస్ గెలిచింది మీడియా తీరు కేసీఆర్ కు అర్థమైంది. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చాక మీడియాపై మరింత నియంత్రణ, కట్టుదిట్టం చేస్తున్నారు.

అయితే ప్రస్తుత కరోనా టైంలో ఫైర్ బ్రాండ్ అయిన ఆంధ్రజ్యోతి ఆర్కే పూర్తిగా కేసీఆర్ సర్కార్ కు సరెండర్ అయిపోయినట్టు అర్థమవుతోంది. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి ఓ స్పెషల్ ఆర్టికల్ మొదటి పేజీలో ఇచ్చి ఏకంగా కేటీఆర్ సూపర్ పవర్ అంటూ చాటిచెప్పారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కూడా ఆంధ్రజ్యోతిలో రావడం లేదు.

Also Read: నాటి మంత్రులు.. నేడు ఎక్కడ ఉన్నారు?

ఇక ఈనాడు పూర్తిగా కేసీఆర్ సర్కార్ భజనను వదిలేసింది. కేటీఆర్ బర్త్ డే ప్రకటనలు రెండు ఫుల్ పేజీలు ఇచ్చినా కూడా ఆయన గురించి రాయలేదు. గడిచిన కొన్ని రోజులుగా కరోనాతో రోగుల అవస్థలు.. తెలంగాణలో రైతులు వివిధ వర్గాల సమస్యలు.. ఈరోజు ఏజెన్సీల్లో వాగులు వంకలు పొంగి పడుతున్న బాధలు.. పాడి రైతుల సమస్యలు అంటూ తెలంగాణలోని సమస్యలను ఎత్తిచూపుతోంది. ఇక తెలంగాణలో కరోనా బాధితులకు మార్గనిర్ధేశనమే లేదంటూ బ్యానర్ కథనాన్ని ఈరోజు ప్రచురించింది. హైకోర్టులో ఈనాడు కథనాల ఆధారంగా సుమోటో గా స్పందిస్తున్నాయి.

దీన్ని బట్టి ఆర్కే పూర్తిగా కేసీఆర్ సర్కార్ కు లొంగిపోయారని.. రామోజీ మాత్రం ప్లేటు ఫిరాయించాడని మీడియా వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.