https://oktelugu.com/

ఆ హీరోయిన్ వద్దంటూ త్రివిక్రమ్ కు దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందువరసలో ఉంటారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఒక్కో పంచ్ డైలాగ్ ఆ సినిమా విడుదలై కొన్నేళ్లు గడిచినా గుర్తుండిపోయే స్థాయిలో ఉంటుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో హీరోయిన్ ను ఎక్కువగా రిపీట్ చేస్తుంటాడని చాలామంది అభిమానులు కామెంట్ చేస్తుంటారు. జల్సా, జులాయి సినిమాలు ఇలియానాతో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూత్రి, అ ఆ సినిమాలు సమంతతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 19, 2020 / 06:23 PM IST
    Follow us on

    టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందువరసలో ఉంటారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఒక్కో పంచ్ డైలాగ్ ఆ సినిమా విడుదలై కొన్నేళ్లు గడిచినా గుర్తుండిపోయే స్థాయిలో ఉంటుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో హీరోయిన్ ను ఎక్కువగా రిపీట్ చేస్తుంటాడని చాలామంది అభిమానులు కామెంట్ చేస్తుంటారు.

    జల్సా, జులాయి సినిమాలు ఇలియానాతో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూత్రి, అ ఆ సినిమాలు సమంతతో తెరకెక్కించారు. అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాల్లో సైతం త్రివిక్రమ్ ఒకే హీరోయిన్ ను రిపీట్ చేశారు. త్రివిక్రమ్ తరువాత సినిమాలో ఎన్టీఆర్ నటించనుండగా ఈ సినిమాలో మళ్లీ సమంత నటించనుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో సమంతను త్రివిక్రమ్ కన్ఫమ్ చేశారనే వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.

    జూనియర్ ఎన్టీఆర్, సమంత కాంబినేషన్లో నాలుగు సినిమాలు తెరకెక్కాయి. బృందావనం సినిమాలో ఎన్టీఆర్ తో జోడీగా సమంత తొలిసారిగా నటించింది. ఆ సినిమా హిట్ రిజల్ట్ ను అందుకుంది. ఆ తరువాత రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాల్లో సినిమాల్లో ఎన్టీఆర్, సమంత కలిసి నటించారు. ఆ రెండు సినిమాలు డిజాస్టర్లు అనిపించుకున్నాయి. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, సమంత నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.

    అయితే మరోసారి ఎన్టీఆర్ సమంత కాంబినేషన్ లో అని వార్తలు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్లీ పాత హీరోయిన్ నే రిపీట్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు. మరీ తివిక్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట వింటాడో లేదో చూడాల్సి ఉంది.