Samantha Vijay Devarakonda: మజిలీ, నిన్ను కోరి ఇలాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీస్ తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమా ‘ఖుషి’. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుంది. ఈ సినిమా అటు విజయ్ దేవరకొండ కి, ఇటు సమంత కి ఇద్దరికీ కూడా ముఖ్యమైన చిత్రం. ఎందుకంటే ఈ సినిమా ముందర వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ అలానే సమంత శాకుంతలం పాన్ ఇండియా డిజాస్టర్స్ గా మిగిలాయి.
అందుకే వీరిద్దరూ కూడా ఖుషి సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో ఒక సూపర్ హిట్ అందుకోవాలని ఉన్నారు.ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్స్ అండ్ ట్రైలర్ ని తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదల చేసుకుంటూ వచ్చారు. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో ఇటీవల తెలుగులో మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేసి గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఆ మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ దేవరకొండ, సమంత వేసిన డాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.
ఇక్కడ వరకు ప్లానింగ్ బాగానే ఉన్నా.. ఆ తరువాత మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు ఈ సినిమా యూనిట్. ముఖ్యంగా సమంత బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యం కోసం విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇక సమంత ప్రమోషన్స్ కి దాదాపు రాదు. ఇక విజయ్ దేవరకొండ పైన ప్రమోషన్స్ భారమంతా ఉంది. కానీ లైగర్ కి ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేసిన విజయ్ దేవరకొండ ఖుషి కి మాత్రం ఆ రేంజ్ లో చేయడం లేదు అనిపిస్తోంది.
సినిమా హిట్ అవ్వాలి అంటే కేవలం తెలుగులో మాత్రమే ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించడం కాకుండా, ఇతర భాషల్లో కూడా ఇంటర్వ్యూలతో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా చేయాలి. ప్రస్తుతం వరకు తెలుగు కాకుండా విజయ్ దేవరకొండ తమిళంలో ఒక రెండు ఈవెంట్స్ లో పాల్గొన్నారు. నార్త్ ఇండియాలో మాత్రం పెద్దగా ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేయలేదు.
మరి ఈ పబ్లిసిటీ ప్లానింగ్ కరెక్టేనా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లైగర్ కి , శాకుంతలంకి.. ఓ లెవెల్ లో ప్రమోషన్స్ చేసిన విజయ్ దేవరకొండ, సమంత.. ఖుషికి మాత్రం ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు అని చాలామంది ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
అయితే దీనికి మరొక కారణం ఉండొచ్చు.. లైగర్ విషయంలో విజయ్ దేవరకొండ ఎక్కువ ప్రమోషన్స్ చేసి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెంచేశారు.. అలా కాకుండా ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా ఇక విడుదలకు వారం మాత్రమే ఉంది.. ఈ వారంలో మళ్లీ ప్రమోషన్స్ పుంజుకుంటాయా లేకపోతే ఇలానే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారా చూడాలి.