Chandrayaan-3
Chandrayaan-3: చందమామ రహస్యాలు విప్పడానికి 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకెళ్లిన చంద్రయాన్_3 దక్షిణ ధ్రువం పై విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే దీని వెనక చాలామంది శాస్త్రవేత్తల కృషి ఉంది. ప్రస్తుతం చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావడంతో వీరి మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. గత నెల 14న చంద్రయాన్_3 ప్రయోగం జరిగినప్పటి నుంచి బుధవారం చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ దాకా మండల కాలం పాటు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తీవ్రంగా శ్రమించారు. ప్రాజెక్టు రూపకల్పన మొదలు విజయతీరాలను ముద్దాడే దాకా నిరంతరం లక్ష్యం వైపు సాగేలా పయనించారు.
సోమ్ నాథ్ భారతి
చంద్రయాన్_3 విజయంలో ఇస్రో చైర్మన్ శ్రీధర సోమనాథ్ భారతి కీలకపాత్ర పోషించారు. ఈయన 1963 లో కేరళ రాష్ట్రం తిరువూరులో శ్రీధర ఫణిక్కర్, తంకమ్మ దంపతులకు జన్మించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరో స్పేస్ లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. 1985లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ లో పనిచేశారు. 2010లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కు అసోసియేట్ డైరెక్టర్గా సేవలు అందిస్తూనే.. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్_3 ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేశారు. జూన్ 2017 నుంచి జనవరి 2018 వరకు తిరువనంతపురంలోని వాలియామల వద్ద ఉన్న లిక్విడ్ ప్రొఫెల్షన్ సిస్టమ్స్ సెంటర్ కు డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తించారు. ఆ తర్వాత ఇస్రో మాజీ చైర్మన్ శివన్ నుంచి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా.. 2022 జనవరిలో ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. చంద్రయాన్_3 తో పాటు త్వరలో ఇస్రో చేపట్టే గగన్ యాన్ మిషన్, సోలార్ మిషన్ ఆదిత్య ఎల్_1 పనులను ఆయన పర్యవేక్షిస్తారు.
వీరముత్తువేల్, చంద్రయాన్_3 ప్రాజెక్టు డైరెక్టర్
చంద్రయాన్_3 లో కొత్త రోవర్, ల్యాండర్ నిర్మాణంలో వీరముత్తు వేల్ కృషి అనన్య సామాన్యమైనది.చంద్రయాన్_2 లో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. వీర ముత్తు వేల్ 1976 అక్టోబర్ 22న తమిళనాడులోని బిల్లుప్పురంలో జన్మించారు. ఈయన తండ్రి పళని వేల్ దక్షిణ మధ్య రైల్వే లో టెక్నీషియన్ గా సేవలు అందించారు. ఆయన పాఠశాల విద్య, డిప్లమా విల్లుపురంలో జరిగింది. తాంబరం లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోస్పేసులో చదువుకున్నారు. 2019లో చంద్రయాన్_3 ప్రాజెక్టు డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం విభాగానికి డిప్యూటీ డైరెక్టర్ గా సేవలు అందించారు.
శంకరన్, యూఆర్ఎస్ సీ డైరెక్టర్
శంకరన్ ను ఇస్రో పవర్ హౌస్ గా పరిగణిస్తారు. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ గా 2021 లో ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఉపగ్రహాలకు అవసరమైన పవర్ సిస్టం ను అభివృద్ధి చేయడంలో ఈయనకు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. భారతదేశ అవసరాలకు తగినట్టుగా కమ్యూనికేషన్, నావిగేషన్, రిమోట్ సెన్సింగ్, గ్రహాల అన్వేషణకు సంబంధించిన ఉపగ్రహాలను తయారు చేయడం యూఆర్ఎస్ సీ బాధ్యత. భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడైన శంకరన్.. చంద్రుడి ఉపరితలాన్ని పోలిన నిర్మాణాన్ని భూమిపై రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు.
ఉన్ని కృష్ణన్, వీఎస్ఎస్ సీ డైరెక్టర్
ఈయన ప్రస్తుతం కేరళలోని తుంబాలో ఉన్న విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. చంద్రయాన్_3 లోని నింగిలోకి తీసుకెళ్లిన ఎల్ఎంవీ_3 ని ఈయన ఆధ్వర్యంలో వీఎస్ఎస్ సీ ని రూపొందించారు. చంద్రయాన్_2 మిషన్ లో కూడా ఉన్ని కృష్ణన్ వీఎస్ ఎస్ సీ లోని తన బృందంతో కలిసి కీలక పాత్ర పోషించారు.
బీఎన్ రామ కృష్ణ, ఐఎస్ టీఆర్ఏసీ
విక్రమ్ ల్యాండర్ కు కమాండ్ లు పంపే బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ సెంటర్ కు ఈయన డైరెక్టర్. భారత్లోని 32 మీటర్ల అతిపెద్ద డిష్ యాంటెనా ఈ కేంద్రంలోని ఉంది. విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియలో 20 మినిట్స్ ఆఫ్ టెర్రర్ గా శాస్త్రవేత్తలు అభివర్ణించే ప్రక్రియను కూడా ఈ కేంద్రం నుంచే పర్యవేక్షించారు.
కల్పన, చంద్రయాన్ _3 డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్
చంద్రయాన్_3 ప్రాజెక్టుకు డిప్యూటీ డైరెక్టర్ గా సేవలు అందించిన కల్పన.. చంద్రయాన్_2 లో కూడా పాలుపంచుకున్నారు. చెన్నై లో బీటెక్ పూర్తయిన తర్వాత ఇస్రోలో చేరిన ఆమె బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రంలో పనిచేశారు. చంద్రయాన్ డిప్యూటీ డైరెక్టర్ గా ఆమె ల్యాండర్, రోవర్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు.
శ్రీకాంత్ చంద్రయాన్_3 మిషన్ ఆపరేషన్ డైరెక్టర్
చంద్రయాన్_3 విజయంలో మిషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఇస్రోతో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న గతంలోనూ ఎన్నో మిషన్లలో భాగస్వామిగా ఉన్నారు. చంద్రయాన్_1,2 లోనూ తన వంతు పాత్ర పోషించారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Chandrayaan 3 the real heroes who made the mission chandrayaan 3 a success these scientists had a hand in making the mission a success
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com