
Samantha : నటిగా సమంత స్టార్ డమ్ ఏంటన్నది ఆమె కెరీర్ ను పరిశీలిస్తే సరిపోతుంది. సూపర్ హిట్లు.. అద్భుతమైన నటనను ప్రదర్శించిన చిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. మంచి నటిగా, గోల్డెన్ లెగ్ గా పేరుగాంచిన సమంత చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ స్టేటస్ ను కొనసాగిస్తూ వచ్చారు. పెళ్లయిన తర్వాత కూడా ఏ మాత్రం జోరు తగ్గలేదు. అయితే.. ఇటీవల పెళ్లి వివాదాలు కూడా చుట్టుముట్టడం.. సినిమాల సంఖ్య కూడా తగ్గించడంతో.. ఇక వెండితెరకు దూరమైనట్టే అనే ప్రచారం సాగింది. అయితే.. వాటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టింది సామ్.
ప్రస్తుతం సమంత చేతిలో రెండు చిత్రాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. తాను లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘శాకుంతలం’ సినిమా షూట్ ఈ మధ్యనే కంప్లీట్ అయ్యింది. మహాభారత ఆదిపర్వంలోని స్వచ్ఛమైన ప్రేమకథను అందించబోతున్నారు దర్శకుడు గుణశేఖర్. దుష్యంతుడు – శకుంతల మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో పౌరాణికంపై పట్టున్న ప్రతిఒక్కరికీ తెలిసిందే. మరి, అలాంటి కావ్యాన్ని గుణశేఖర్ సెల్యూలాయిడ్ పై ఏవిధంగా చెక్కారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ చిత్రం తర్వాత విఘ్నేశ్ శివన్‌మూవీ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాలతో విజయ్ సేతుపతి, నయనతార వంటి స్టార్లతో నటిస్తోంది సామ్. తమిళ్, తెలుగు భాషల్లో ఈ మూవీ రాబోతోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు మాత్రమే సమంత కిట్ లో ఉన్నాయి. ఇప్పటి వరకూ మరో సినిమాకు సైన్ చేయలేదు సామ్. దీంతో.. ఈ రెండు చిత్రాల తర్వాత సినిమాలకు సమంత దూరం కానుందనే చర్చ గట్టిగానే సాగుతోంది. ఈ చర్చ ఇలా ఉండగానే.. సమంత-చైతూ విడాకుల వ్యవహారం ఎంత దుమారం రేపుతోందో తెలిసిందే.
వీళ్లిద్దరి మధ్య దూరం చాలా దూరం వెళ్లిపోయిందని అంటున్నారు. ఫ్యామిలీ గొడవలు ముదరడంతో.. ప్రస్తుతం సమంత హైదరాబాద్ ను ఖాళీ చేశారు. చైతూకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో చెన్నైలో నివాసం ఉంటోంది. త్వరలో ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ఉంటూ.. వెబ్ సిరీస్ లు, సినిమాలు చేసుకోవాలని సమంత ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఓ సినిమాకు సైన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది.
ఆదిత్య 369, జెంటిల్ మేన్ వంటి చిత్రాలు నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించబోతున్న సినిమాలో.. సమంత నటించబోతోందని తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో నటించేందుకు సామ్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ విధంగా.. తాను సినిమాలకు దూరం కావట్లేదని సామ్ క్లారిటీ ఇచ్చిందని అంటున్నారు.