GST: రోజురోజుకు పెట్రో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా తక్కువగానే ఉన్నా మనదేశంలో మాత్రం అంతకంతకు మీదికి పోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం గురించి చర్చ జరగడంతో సామాన్యుడిలో ఆశలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై పట్టించుకున్నా స్టేట్లు మాత్రం దీనికి సహకరిస్తాయా లేదా అనే సంశయాలు వస్తున్నాయి. దీంతో పెట్రో ధరలు తగ్గించే విషయంలో కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది.
పెట్రోల్ బేస్ ధర రూ.40కి దగ్గరలో ఉంటుంది. దీని మీద వ్యాట్, డీలర్ కమిషన్, ఎక్సైజ్ డ్యూటీ వంటి చార్జీలతో కలిసి రూ.60 కి పైగా ఉంటుంది. దీంతో ప్రస్తుత ధర రూ. వంద దాటింది. దీంతో ప్రజలపై భారం పడుతోంది. పన్నుల్లో వ్యత్యాసం ఉన్నందున తేడా భారీగా ఉంటోంది. జీఎస్టీలో అనేక శ్లాబులున్నాయి. గరిష్ట శ్లాబు అయినా 28 శాతం పరిధిలోనే పెట్రోల్, డీజిల్ ను చేరిస్తే పెట్రోల్ ధర రూ.55-56 వరకు తగ్గిపోవచ్చు. డీజిల్ ధర రూ. 50 వరకు తగ్గుతుంది.
పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే స్టేట్ల ఆదాయం పోతుందనే ఉద్దేశంతో అవి ఒప్పుకోవని తెలుస్తోంది. దీంతో కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పన్నుల ద్వారా ఏడాదికి రూ.5 లక్షల కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. ఇందులో స్టేట్ల వాటా రూ. 2 లక్షల కోట్లు. దీంతో స్టేట్లు జీఎస్టీని ఒప్పుకోవడానికి ఇష్ట పడటం లేదు. జీఎస్టీతో ధరలు తగ్గితే అన్ని ధరలు అదుపులోకి వచ్చి సామాన్యుడికి అందుబాటులో ఉంటాయి. దీంతో సామాన్య జీవన విధానం మారిపోతోందని భావిస్తున్నారు.
జీఎస్టీ లోకి తేవడం వల్ల అనేక వస్తువుల, సేవల ధరలు తగ్గి అన్నింటి ధరలు అదుపులోకి రావడంతో అందరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. 50 శాతం వరకు ధరలు అదుపులోకి వచ్చి మనకు లాభం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం స్టేట్లను ఒప్పించి జీఎస్టీ అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.