Homeఎంటర్టైన్మెంట్First Song From Akhanda: మహేష్ సాంగ్ బాలయ్యకి సెట్ చేశాడు !

First Song From Akhanda: మహేష్ సాంగ్ బాలయ్యకి సెట్ చేశాడు !

First Song From Akhanda: Mahesh Song Set To Balakrishna

First Song From Akhanda: నటసింహం బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చేస్తోన్న రోటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ‘అఖండ’. కాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 18 సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ మెలోడీ రిలీజ్ కాబోతుంది. అయితే, ఈ అప్ డేట్ ఇస్తూ మేకర్స్ ఒక అదిరిపోయే పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

పోస్టర్ లో బాలయ్య సిగ్గు పడుతూ స్టైల్ గా పోజ్ ఇస్తే.. పక్కన ప్రగ్యా జైస్వాల్ నవ్వుతూ కనిపించింది. మొత్తానికి పోస్టర్ అదిరిపోయింది. అయితే, ఈ సాంగ్ బాలయ్య కెరీర్ లోనే గొప్ప క్లాసిక్ సాంగ్ గా నిలిచిపోతుందట. నిజానికి ఈ సాంగ్ ను గతంలో థమన్ మహేష్ బాబు కోసం కంపోజ్ చేశాడని.. కానీ మహేష్ సినిమాలో ఈ సాంగ్ సెట్ కాకపోవడంతో.. ఎప్పటి నుంచో థమన్ ఈ సాంగ్ ను తన దగ్గరే పెట్టుకున్నాడట.

కానీ, అఖండ సినిమాలో పాట వచ్చే సన్నివేశానికి ఈ సాంగ్ కి బాగా లింక్ ఉండటంతో థమన్ ఈ సాంగ్ ను బాలయ్య కోసం ఇచ్చేశాడు. సాంగ్ లో చాలా కొత్త ట్యూన్స్ ను థమన్ పరిచయం చేయబోతున్నాడు. ఇక ‘అఖండ’ సినిమా డిజిటల్ రైట్స్ కోసం దాదాపు 20 కోట్లు ఇవ్వడానికి జీ5 సంస్థ రెడీగా ఉందట. మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా బాలయ్య అభిమానూలు చాల సంవత్సరాలు తరువాత తల ఎత్తుకుని సగర్వంగా తమ అభిమాన హీరో సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమా టీజర్. 60 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది అఖండ టీజర్. అందుకే, ఈ సినిమా శాటిలైట్ డీల్ కూడా ఎప్పుడో కుదిరింది.

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడం, సినిమాకి మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమా థియేటర్స్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular