Samantha : నాగ చైతన్య కి లీగల్ నోటీసులు పంపించిన సమంత..శోభిత తో పెళ్ళికి చిక్కులు..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

నాగ చైతన్య కి కోర్టు ద్వారా లీగల్ నోటీసులు పంపించిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. విడాకులు తర్వాత కూడా నేను ఆ ఇంటి కోసం ఆశపడలేదని, కానీ ఆ ఇంటిని వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ ఫర్ చేస్తే ఊరుకునేది లేదని, ఆ ఇంటి పై నాగ చైతన్య తో పాటు నాకు కూడా సమాన హక్కు ఉందంటూ సమంత ఆధారాలతో సహా కోర్టులో కేసు వేసిందట

Written By: Vicky, Updated On : October 30, 2024 5:32 pm

Samantha - Naga Chaithanaya

Follow us on

Samantha :  సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభితతో డేటింగ్ చేసి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. శోభిత పెళ్లి పనుల్లో చురుగా పాల్గొంటూ తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటుంది. మరోపక్క నాగ చైతన్య తాను కమిట్ అయిన ‘తండేల్’ చిత్రాన్ని పూర్తి చేసి, పెళ్లి పనుల్లో నిమగ్నం అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సమంత నాగ చైతన్య కి లీగల్ నోటీసులు పంపించింది అనే వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సమంత, నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ లోని ఒక ప్రాంతంలో అందమైన ఇల్లు ని కట్టుకున్నారు. పెళ్ళైన రెండేళ్ల తర్వాత వీళ్లిద్దరు ఆ ఇంట్లో కాపురానికి వెళ్లారు. విడాకులు తీసుకునే ముందు వరకు కూడా వీళ్లిద్దరు ఆ ఇంట్లోనే ఉండేవారు.

సమంత అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇల్లుని డిజైన్ చేయించాడు నాగ చైతన్య. ఈ ఇల్లు నిర్మాణానికి నాగచైతన్య కంటే అధికంగా సమంత డబ్బు ఖర్చు చేసిందట. అయితే శోభిత తో పెళ్లి తర్వాత నాగ చైతన్య కొత్త కాపురం ఆ ఇంట్లోనే పెట్టబోతున్నాడని, అంతే కాకుండా ఆ ఇంటిని శోభిత పేరు మీద రిజిస్టర్ చేయించబోతున్నాడని తెలుసుకున్న సమంత, వెంటనే తన లాయర్ తో మాట్లాడి నాగ చైతన్య కి కోర్టు ద్వారా లీగల్ నోటీసులు పంపించిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. విడాకులు తర్వాత కూడా నేను ఆ ఇంటి కోసం ఆశపడలేదని, కానీ ఆ ఇంటిని వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ ఫర్ చేస్తే ఊరుకునేది లేదని, ఆ ఇంటి పై నాగ చైతన్య తో పాటు నాకు కూడా సమాన హక్కు ఉందంటూ సమంత ఆధారాలతో సహా కోర్టులో కేసు వేసిందట.

దీనిని విచారించిన కోర్టు నాగ చైతన్య కి లీగల్ నోటీసులు పంపించారట. ఈ విషయం సోషల్ మీడియా అంతటా వ్యాప్తి చెందడంతో, సమంత నాగ చైతన్య ని గురి చూసి భలే దెబ్బ కొట్టింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో చూడాలి. ఇది ఇలా ఉండగా విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య ఒకరిని ఒకరు పూర్తిగా మర్చిపోయి, ఎవరి కెరీర్స్ లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మరోపక్క నాగ చైతన్య ‘తండేల్’ చిత్రం షూటింగ్ లో బిజీ గా గడుపుతున్నాడు. చందు మొండేటి దర్శకత్వం లో సాయి పల్లవి హీరోయిన్ గా, అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.