Pawan Kalyan fan : పవన్ కళ్యాణ్ పై అభిమానం వెలకట్టలేనిది. ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో పవన్ మానియా పతాక స్థాయికి చేరింది. జనసేనకు సాలిడ్ విజయం దక్కడంతో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అంటూ స్లొగన్స్ ప్రజల్లో బలంగా వినిపించాయి.అంతలా మారింది పవన్ పై అభిమానం. చివరకు చిన్న పిల్లలకు సైతం ఆ అభిమానం తాకింది. తాజాగా ఓ యువకుడు అయితే పవన్ కోసం ఏకంగా 1300 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం వెలుగులోకి వచ్చింది. పవన్ పై ఉన్న అభిమానంతో విజయవాడ నుంచి కోల్కత్తా కు బయలుదేరాడు ఓ యువకుడు. మార్గమధ్యంలో ఆయన గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. విజయవాడ 60 వ డివిజన్ వాంబే కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావుకు పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఏపీ ఎన్నికల్లో పవన్ గెలిస్తే విజయవాడ నుంచి కోల్కతా కాళీమాత ఆలయానికి కాలినడకన వస్తానని మొక్కుకున్నాడు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎం కావడంతో ఆనందపడ్డాడు. తన అభిమాన హీరో కోసం మొక్కు తీర్చుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈనెల 5వ తేదీన విజయవాడ నుంచి కోల్కత్తా కు కాలినడకన బయలుదేరాడు. ఇప్పటివరకు వేయి కిలోమీటర్ల నడకను పూర్తి చేశాడు. మరో 300 కిలోమీటర్లు నడిచి కోల్కత్తాలోని కాళీమాతను దర్శించుకోనున్నాడు.
* తాను ఏదీ ఆశించి చేయలేదు
అయితే మార్గమధ్యంలో ఒడిస్సా ప్రాంతంలో స్థానికులు ఇతనిని పలకరించారు. కాలినడక ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాళీమాతను దర్శించుకున్న తర్వాత.. తాను అభిమానించే పవన్ కళ్యాణ్ ఒకసారి కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరికగా ఉందని.. తాను ఏమీ ఆశించి ఇలా పాదయాత్ర చేయలేదని.. కేవలం పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి ఇలా చేశానని చెప్తున్నారు.
* అభిమానానికి ఎల్లలు లేవు
గతంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సంబరాలు చేసుకున్నారు. అయితే పవన్ అభిమానులకు ఎల్లలు లేవు. ఆయనకు ఒడిస్సా తో పాటు కర్ణాటక తమిళనాడులో సైతం అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను అభిమానించేవారు దేవాలయాల సందర్శనకు కాలినడకన వెళుతుండడం విశేషం. అయితే ఏపీలో పవన్ పై ఉన్న అభిమానాన్నిచూస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు మాత్రం ఫిదా అవుతున్నారు.
విజయవాడ 60వ డివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు… పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు….. గత ఎన్నికలలో… pic.twitter.com/4Gw7QDa4tQ
— బెజవాడ కుర్రోడు (@AyanPawanist_) October 29, 2024