https://oktelugu.com/

సమంత సామ్-జామ్..అన్ని కలిపేసి కిచిడిలా మారిందా?

టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత(సామ్) ఒకరు. అక్కినేని కోడలుగా మారిన తర్వాత కూడా సామ్ సినిమాల్లో బీజీగానే కొనసాగుతోంది. పెళ్లి తర్వాత ఎలాగూ అవకాశాలు తగ్గుతాయని భావించిన సమంత ముందుస్తుగానే ఆ మేరకు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తెలుగులో ప్రముఖ ఓటీటీగా పేరొందిన ‘ఆహా’లో ఓ కార్యక్రమానికి హోస్టుగా చేసేందుకు ఒప్పుకుంది. Also Read: బిగ్ బాస్-4.. ఎలిమినేషన్ లీక్.. ఈసారి మోహబూబ్ ఔట్ తాజాగా ‘ఆహా’లో సమంత చేసిన కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 / 12:28 PM IST
    Follow us on


    టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత(సామ్) ఒకరు. అక్కినేని కోడలుగా మారిన తర్వాత కూడా సామ్ సినిమాల్లో బీజీగానే కొనసాగుతోంది. పెళ్లి తర్వాత ఎలాగూ అవకాశాలు తగ్గుతాయని భావించిన సమంత ముందుస్తుగానే ఆ మేరకు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తెలుగులో ప్రముఖ ఓటీటీగా పేరొందిన ‘ఆహా’లో ఓ కార్యక్రమానికి హోస్టుగా చేసేందుకు ఒప్పుకుంది.

    Also Read: బిగ్ బాస్-4.. ఎలిమినేషన్ లీక్.. ఈసారి మోహబూబ్ ఔట్

    తాజాగా ‘ఆహా’లో సమంత చేసిన కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. సామ్-జామ్ పేరిట రూపొందిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని టాక్ విన్పిస్తోంది. సమంత హోస్టుగా చేస్తుందంటే సంథింగ్ స్పెషల్ గా కార్యక్రమం ఉంటుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ షోపై పెదవి విరుస్తున్నారు.

    ఇప్పటికే బుల్లితెరపై రన్ అవుతున్న పలు షోలను తలపించేలా ‘సామ్-జామ్’ కార్యక్రమం ఉందనే టాక్ తెచ్చుకుంది. జీ తెలుగులో వస్తున్న ‘బతుకు జట్కాబండి’.. ఈటీవీలో వస్తున్న ‘అలీతో సరదాగా’.. ‘క్యాష్’ ప్రోగ్రాంలోని కొన్నింటిని మిక్స్ చేసి ‘సామ్-జామ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు కన్పిస్తోంది.

    Also Read: టాలీవుడ్ అప్డేట్: మేనేజర్లు కాస్తా నిర్మాతలుగా మారుతున్నారా?

    సామ్-జామ్ తొలి ఎపిసోడ్లో ఓ స్టార్ ను కూర్చోబెట్టి సమంత యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ఓ మానసిక నిపుణుడిని.. వైద్యుడ్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం.. ఆ వెంటనే ఓ పేద కుటుంబాన్ని వేదికపైకి తీసుకొచ్చి వాళ్లతో మాట్లాడించడం.. మధ్యమధ్యలో వైవా హర్షం ఎందుకు వస్తున్నాడో.. ఎందుకో పోతున్నాడో తెలియకపోవడం కన్పించాయి. మొత్తానికి షో నిర్వాహాకులు ఏదో కొత్త ట్రై చేయాలని తలంచి చివరికీ కిచిడి చేసినట్లు కన్పిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్