https://oktelugu.com/

చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్

కరోనా వచ్చిందన్నాడు.. తూచ్ అది అబద్ధం తప్పుడు రిపోర్ట్ అని చిరంజీవి తన అభిమానులకు కంగారు పెట్టాడు. తప్పుడు టెస్ట్ కిట్ వల్ల తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అనంతరం అపోలో సహా మూడు ల్యాబ్ లలో చేసుకున్నాక కరోనా నెగెటివ్ వచ్చిందని రిపోర్టులో తేలిందన్నారు. అనంతరం వెంటనే తన గురువు విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. వృద్ధులైన విశ్వనాథ్ దంపతులకు ఒకవేళ కరోనా అంటితే ఏంటి సంగతి అని అందరూ ఆందోళన చెందుతున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 12:44 pm
    Follow us on

    Chiranjeevi Corona

    కరోనా వచ్చిందన్నాడు.. తూచ్ అది అబద్ధం తప్పుడు రిపోర్ట్ అని చిరంజీవి తన అభిమానులకు కంగారు పెట్టాడు. తప్పుడు టెస్ట్ కిట్ వల్ల తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అనంతరం అపోలో సహా మూడు ల్యాబ్ లలో చేసుకున్నాక కరోనా నెగెటివ్ వచ్చిందని రిపోర్టులో తేలిందన్నారు. అనంతరం వెంటనే తన గురువు విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. వృద్ధులైన విశ్వనాథ్ దంపతులకు ఒకవేళ కరోనా అంటితే ఏంటి సంగతి అని అందరూ ఆందోళన చెందుతున్నారు.

    Also Read: బిగ్ బాస్-4.. ఎలిమినేషన్ లీక్.. ఈసారి మోహబూబ్ ఔట్

    ఈ క్రమంలోనే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరుశాతం ఖచ్చితత్వంతో రాదని ఆయన అన్నారు. ఒకసారి పాజిటివ్ వస్తే.. పాజిటివ్ గానే భావించాల్సి ఉంటుందని.. తర్వాత నెగెటివ్ వచ్చినా లక్షణాలు లేకున్నా క్వారంటైన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

    పాజిటివ్ గా తేలి.. ఆపై నెగెటివ్ వచ్చినా ఐసీఎంఆర్ , మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం  క్వారంటైన్ లో ఉండాల్సిందేనని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.ఒక్కసారి పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగెటివ్ అని వచ్చినప్పటికీ చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరిగా ఫాలో అవ్వాలన్నారు.

    Also Read: టాలీవుడ్ అప్డేట్: మేనేజర్లు కాస్తా నిర్మాతలుగా మారుతున్నారా?

    దీంతో కరోనా నెగెటివ్ అని తెలియగానే జనాల్లోకి వచ్చిన చిరంజీవి తీరును డాక్టర్ శ్రీనివాసరావు తప్పుపట్టారు. ఇప్పటికైనా చిరంజీవి క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్