Samantha: సమంత ఓపెన్ మైండెడ్. చాలా భిన్నంగా ఆలోచిస్తారు. మనసులో ఉన్న భావం ఏదైనా షేర్ చేసేస్తారు. అందులో ఎలాంటి దాపరికాలు ఉండదు. అన్నింటికీ మించి ఆంక్షలు సహించరు. స్వేచ్ఛగా జీవించాలని అనుకుంటారు. నాగ చైతన్యతో విడాకులకు కారణం కూడా ఇదే అనే ఒక వాదన ఉంది. తన పరిధిలో తాను ఉంటూ ఇష్టాలను గౌరవిస్తూ బ్రతికేస్తారు. తాజాగా స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద భర్త రాహుల్ రవీంద్రన్ పై ఆమె ప్రేమ కురిపించారు. ఆయనకు ఐ లవ్ యూ చెప్పారు.
ప్రపంచంలోనే నైసెస్ట్ పర్సన్ అంటూ కొనియాడారు. ఆయన్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉటానంటూ కామెంట్స్ చేశారు. అలాగే ఆయన వీక్నెస్ ఒకటి బయటపెట్టింది. రాహుల్ రవీంద్రన్ భోజన ప్రియుడు అట. తాను తినేటప్పుడు పక్కవాళకు ఫుడ్ ఇవ్వాల్సి వస్తే చాలా బాధపడిపోతాడట. రాహుల్ రవీంద్రన్ ఫోటోలు షేర్ చేసిన సమంత ఈ కామెంట్స్ చేశారు. అలాగే ఓ వీడియో కూడా ఆమె అందులో పొందుపరిచారు. డైట్ లో భాగంగా సమంత తినే ఫుడ్ రాహుల్ రవీంద్రన్ కి సర్వ్ చేసింది.
ఫుడ్ ఎలా ఉందని సమంత అడిగింది . చెప్పాలంటే ఇది ఫుడ్ కాదు. అయితే ఇందులో సాల్డ్, మసాలా ఉన్నాయి. ఇబ్బందిగా ఉన్నా పర్లేదు, అంటూ రాహుల్ రవీంద్రన్ తిన్నాడు. రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి, సమంత బెస్ట్ ఫ్రెండ్స్. కెరీర్ బిగినింగ్ నుండి సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. అయితే యశోద, శాకుంతలం చిత్రాలకు మాత్రం సమంత ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇకపై కూడా సమంత డబ్బింగ్ చెప్పుకోనున్నారు. దీంతో చిన్మయి ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఇకపై సమంతకు నా అవసరం లేదని ఆ మధ్య కామెంట్ చేసింది.
కాగా రాహుల్ రవీంద్రన్ నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. ఇక సమంత షూటింగ్స్ తో ఫుల్ బిజీ. విజయ్ దేవరకొండకు జంటగా చేస్తున్న ఖుషి షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం. సిటాడెల్ షూటింగ్ మధ్యలో ఉంది. ఈ యాక్షన్ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడుతున్నారు. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తుండగా రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది.