Niharika Konidela: మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల, నటిగా తన అన్నయ్య వరుణ్ తేజ్ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఆమె సినిమాలు దూరంగా ఉంటూ కేవలం ప్రొడక్షన్ లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. పలు వెబ్ సిరీస్ లను నిర్మించింది. అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో మళ్ళీ నటిగా మారి ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
ఈ సిరీస్ పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక గత కొంతకాలం గా ఆమె తన భర్త చైతన్య తో దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఆమె సినిమాల్లోకి హీరోయిన్ గా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. అందుకే ఈమధ్య ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అందాలను ఆరబోస్తుంది.
మెగా ఫ్యాన్స్ అందరూ ఏమిటి ఈమె ఈమధ్య హద్దులు దాటి మరి అందాలను ఆరబోస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. అసలు నిజం ఇది, ఈమె రీసెంట్ గానే ఒక ప్రముఖ యంగ్ హీరో సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రాబోతున్నాయి. మరి సెకండ్స్ ఇన్నింగ్స్ లో అయినా మెగా డాటర్ సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.
ఇక రామ్ చరణ్ కి రీసెంట్ గా ఒక పాప పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. పాప ఉపాసన కడుపులో పడగానే అన్నీ మంచి జరుగుతున్నాయని, ఇక నుండి కూడా అన్నీ మంచే జరుగుతుందని చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. మరి ఈ పాప ప్రభావం నిహారిక మీద కూడా పడుతుందో లేదో చూడాలి. ఇక ఆమె అన్నయ్య వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.