Samantha Ruth Prabhu Recent Affair: సమంత(Samantha Ruth Prabhu) చాలా కాలం నుండి రాజ్ నిడిమోరు(Raj Nidimoru) అనే వ్యక్తితో ప్రేమాయణం నడుపుతుంది అనే విషయం ఓపెన్ సీక్రెట్. ఇప్పటి వరకు ఆమె ఈ విషయాన్ని బయట పెట్టలేదు కానీ, అనేక సందర్భాల్లో తన ఫ్యాన్స్ కి పరోక్షంగా ఈ విషయం చెప్పకనే చెప్పింది. ఇప్పుడు అయితే ఆమె దాదాపుగా ఓపెన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రాజ్ నిడిమోరు తో కలిసి వెళ్లిన వెకేషన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి సంచలనం సృష్టించింది. ఇంత పబ్లిక్ గా తన ప్రియుడితో కలిసి తిరుగుతున్న ఫోటోలను సమంత షేర్ చేసిందంటే, త్వరలోనే అతనితో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకొని పెళ్ళికి రెడీ అవ్వబోతుందేమో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అదే కనుక జరిగితే సమంత అభిమానులు ఎంతో ఆనందిస్తారు అనుకోవచ్చు.
Also Read: ‘ఎల్లమ్మ’ చిత్రం ఇక లేనట్టేనా..? దిల్ రాజు నితిన్ ని రోడ్డు మీదకు లాగేశాడుగా!
అయితే ఈ ఫోటోలు బాగా వైరల్ అవ్వడం తో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ఏ మతమైనా ఒక మనిషికి చెప్పేది ఏమిటంటే, మీ చర్యలతో ఎదురు వ్యక్తిని బాధించవద్దు అని. అదే మన జీవితం లో పాటించాల్సిన గొప్ప విషయం’ అంటూ చెప్పుకొచ్చింది. ఇలా శ్యామాలి సోషల్ ఇన్ స్టాగ్రామ్ లో రాజ్ నిడిమోరు పై పరోక్షంగా సెటైర్స్ వేయడం కొత్తేమి కాదు. సమంత రాజ్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియా లో అప్లోడ్ అయ్యి వైరల్ అయ్యినప్పుడల్లా ఆమె కౌంటర్ గా ఇలాంటి స్టోరీలు తన ఇన్ స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటుంది. ఇకపోతే సమంత కి రాజ్ నిడిమోరు తో పరిచయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ ద్వారా మొదలైంది. ఈ వెబ్ సిరీస్ లో సమంత విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.
Also Read: లంచ్ లోకి మటన్ తీసుకురాలేదని షూటింగ్ ఆపేసిన నటుడు.. వైరల్ వీడియో…
ఈ సిరీస్ ద్వారానే సమంత కి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లభించింది. ఈ సిరీస్ తర్వాతనే ఆమె తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుంది. ఇక ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆమెకు ఎంతో సహాయ సహకారాలు అందించాడు. అప్పటి వరకు మంచి స్నేహితులుగా ఉన్న సమంత, రాజ్ మధ్య ప్రేమ చిగురించింది ఈ సమయంలోనే అని అందరూ అంటుంటారు. అయితే అనారోగ్యం కారణంగా కొంతకాలం విరామం తీసుకున్న సమంత రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా ‘శుభమ్’ అనే చిత్రం తో భారీ కమర్షియల్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలో ఆమె తిరుపతికి రాజ్ నిడిమోరు తో కలిసి వచ్చింది. అప్పుడే ఈ రూమర్స్ కి ఎంతో బలం చేకూరింది. ఇప్పుడు లేటెస్ట్ పోస్ట్ తో వీళ్ళ మధ్య రిలేషన్ ఖరారు అయిపోయింది.