Satya Prakash Unknown Facts: సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించాలనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే వెండితెర మీద కనిపించే ప్రేక్షకులందరిని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సత్య ప్రకాష్ (Satya Prakash)…ఈయన విలన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. పోలీస్ స్టోరీ, సీతా రామరాజు అనే సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కొన్ని అవమానాలైతే జరిగాయట…ఆయన అప్పట్లోనే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం వల్ల ఆకలి విపరీతంగా వేసేదట. ఇక సినిమా షూటింగ్ ఉన్న సందర్భంలో ఆయన కి రెండు ఇడ్లీ లు, ఒక వడ మాత్రమే పెట్టారట. ఇంకొక ఇడ్లీ వేయొచ్చు కదా అని అడిగినందుకు ఇడ్లీలు లేవు ఏం లేవు వెళ్ళు అని తిట్టారట. అయినప్పటికీ తనకి ఏం చేయాలో అర్థం కాక చాలా కామ్ గా ఉండిపోయారు అంట…ఇక ఫైట్ మాస్టర్ దగ్గర ఫైట్ సీన్స్ ని చిత్రీకరిస్తున్న సందర్భంలో ఆయన చేయాల్సిన ఫైట్ సీక్వెన్స్ సరిగ్గా రాలేదట. అప్పటికే 6 టేకులు తీసుకున్న కూడా సరిగ్గా రాకపోవడంతో అతని ప్లేస్ లో ఇంకొరిని మార్చండి అని ఫైట్ మాస్టర్ చెప్పడంతో అక్కడున్న వాళ్లు అతన్ని మార్చేశారట…
దాంతో ఆయన బయటకు వచ్చి కొంతవరకు నర్వస్ ఫీల్ అవుతున్న సందర్భంలో ఆ సినిమా కో డైరెక్టర్ బయటికి వచ్చి స్మోక్ చేస్తూ ఇలాంటి వాళ్లు కూడా ఇండస్ట్రీకి వస్తుంటారు అంటూ కొన్ని బూతులు అయితే మాట్లాడట. అప్పుడు అది విన్నా సత్య ప్రకాష్ కి చాలా బాధేసిందట. అయినప్పటికి పట్టువదలని విక్రమార్కుడిలా సినిమా ఇండస్ట్రీలో రాణించాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఇండస్ట్రీ లో ఎదిగాడు.
Also Read: ‘ఎల్లమ్మ’ చిత్రం ఇక లేనట్టేనా..? దిల్ రాజు నితిన్ ని రోడ్డు మీదకు లాగేశాడుగా!
అయితే అది జరిగిన 12 సంవత్సరాల తర్వాత ఆయన మంచి నటుడిగా ఎదిగిన తర్వాత క్యారవన్ లో రెడీ అవుతున్నప్పుడు అప్పట్లో అతన్ని తిట్టిన కో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు కూడా కో డైరెక్టర్ గానే ఉన్నారట.ఆ డైరెక్టర్ తన దగ్గరికి వచ్చినప్పుడు సత్య ప్రకాష్ ఆ విషయాన్ని గుర్తు చేసి మీరు అప్పుడు ఇలా అన్నారు అలా అనడం తప్పు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఎన్నో ఆశలతో వస్తారు.
వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు డిస్కరేజ్ మాత్రం చేయకండి అంటూ చెప్పాడట. ఇక దాంతోపాటుగా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ల గురించి కూడా మాట్లాడుతూ ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన పట్టించుకోకండి. మీరు ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగితే మీకంటూ ఒక రోజు వస్తుంది తప్పకుండా సక్సెస్ సాధిస్తారు అంటూ ఆయన చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి…