Sadhguru Satires On Samantha: హీరోయిన్ సమంతపై గురువు జగ్గీ వాసుదేవ్ సెటైర్స్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఆయనలోని ఈ హ్యూమర్ యాంగిల్ అందరి చేత నవ్వులు పూయించింది. ముఖ్యంగా సమంత వేదికపై పడి పడి నవ్వేశారు. ఇటీవల హైదరాబాద్ వేదిక సేవ్ సాయిల్ కార్యక్రమం జరిగింది. కాలుష్యం నుండి నదులను, మట్టిని ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గీ వాసుదేవ్ హాజరయ్యారు. హీరోయిన్ సమంత ఆయనను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇక సమంతను చూసిన వెంటనే జగ్గీ వాసుదేవ్ ఆమెపై ఛలోక్తులు విసిరారు.
Sadhguru, Samantha
సమంత నేటి ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారు. కారణం ఏమిటంటే నేను పసుపు రంగు కుర్తా వేసుకొని వచ్చానని తెలిసి.. ఆమె బట్టలు మార్చుకోవడానికి తిరిగి వెనక్కి వెళ్లారు. దాని వలన కొంచెం ఆలస్యమైంది, అంటూ ఆయన కామెంట్ చేశారు. సమంత ఎల్లో శారీ కట్టుకొని కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ఆమె మ్యాచింగ్ వేసుకొచ్చారని జగ్గీ వాసుదేవ్ పరోక్షంగా సమంతపై సెటైర్ వేశారు. సద్గురు కామెంట్స్ కి సమంత గట్టిగా నవ్వేశారు. ఇక ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు సమంత.. సద్గురు గురించి మాట్లాడారు.
Also Read: Rana Last Movie: ఇదే నా చివరి సినిమా – రానా దగ్గుపాటి
సహజంగా నేను ఇంటర్వ్యూకి ఎటువంటి నోట్స్ లేకుండానే వస్తాను. మిమల్ని చూస్తే మాత్రం నేను నా పేరు కూడా మర్చిపోతాను. అందుకే ఏమి అడగాలో చీటీలు రాసుకొచ్చుకున్నానని సమంత సరదా కామెంట్ చేశారు. సమంత-సద్గురు మధ్య నడిచిన ఈ సరదా సంభాషణ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. మరోవైపు సమంత నటిగా ఫుల్ బిజీ ఉన్నారు. ఆమె నటిస్తున్న ఖుషి, యశోద చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఖుషి మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
Samantha
ఇక యశోద పాన్ ఇండియా ఫిలిం గా విడుదల కానుంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే ఇటీవల రణ్వీర్ సింగ్ తో ఓ బాలీవుడ్ మూవీ చేస్తున్నట్లు సమంత హింట్ ఇచ్చారు. సమంత నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ అదే కావడం విశేషం. అలాగే సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు.
Also Read:F3 Closing Collections: F3 క్లోసింగ్ కలెక్షన్లు.. దిల్ రాజుకు భారీ నష్టాలు