NTR
NTR30 Release Date: ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తీసిన తర్వాత కొరటాల శివ, #RRR తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మోతమోగిపోయ్యే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమాని తీసాడు..ఇక మా ఎన్టీఆర్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని భయపడుతున్న అభిమానులకు ఈ గ్లిమ్స్ వీడియో కాస్త ఊరటని ఇచ్చింది..ముఖ్యంగా అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు పిచ్చెక్కిపోయ్యేలా చేసింది..ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్నారు..ఎందుకంటే సుమారు వాళ్ళు #RRR సినిమా కోసం సుమారు మూడున్నర ఏళ్ళు ఎంతో నిరీక్షించారు..సినిమా అనుకున్న దానికంటే విజయం సాధించిన ఎన్టీఆర్ పాత్ర పట్ల అభిమానులు సంతృప్తి చెందలేదు..తమ హీరోని సపోర్టింగ్ యాక్టర్ లాగా సినిమాలో చూపించాడని మొదటి రోజు నుండి రాజమౌళి ని ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో ట్యాగ్ చేసి తిడుతూనే ఉన్నారు..దానితో అభిమానులందరూ ఇప్పుడు ఎన్టీఆర్ సోలో హీరో గా చేస్తున్న సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Rajamouli, NTR
Also Read: Pawan Kalyan : కోట్లు పెట్టిన ఆ నిర్మాతను పవన్ కళ్యాణ్ ముంచుతాడా? తేల్చుతాడా? కారణం అదే?
అలాంటి అభిమానులకు ఇప్పుడొక వార్త సంబరాలు చేసుకునేలా చేస్తుంది..అదేమిటంటే ఈ సినిమాని వచ్చే ఏడాది మే 30 తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకోచేందుకు సన్నాహాలు చేస్తున్నారట..ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, స్క్రిప్ట్ పై రీ వర్క్ చెయ్యడం కోసం మరింత సమయం కావాలి అని ఎన్టీఆర్ ని కొరటాల శివ అడగడం తో షూటింగ్ ఆలస్యం అవుతూ వెళ్తుంది..ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే..ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదట..ఆగష్టు మొదటి వారం లో షూటింగ్ కి పూజ కార్యక్రమాలు ప్రారంభించి..చివరి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం..ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్స్ కి లీడర్ గా కనిపించనున్నాడట..ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం పై ఇప్పటికి క్లారిటీ రాలేదు..తొలుత అలియా భట్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోగా..ఆ తర్వాత ఎందుకో ఆమె పలు కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకుంది..ఇప్పుడు ఈ సినిమాలో చివరికి సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది.
NTR30 Release Date
Also Read: Anasuya Bharadwaj: అనసూయ పోజులపై నెటిజన్ల నెగెటివ్ కామెంట్లు వైరల్