Samantha : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే టాప్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని ఈమె వాడినట్టు ఏ హీరోయిన్ కూడా వాడదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టోరీస్ అప్లోడ్ చేయడం, రీల్స్ చేయడం, అప్పుడప్పుడు తనకు సంబంధించి కొన్ని హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు పెట్టడం, ఇలా ఒక్కటా రెండా ఎప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది సమంత. అప్పుడప్పుడు ఈ పెట్టే పోస్టులు వివాదాలకు కూడా దారి తీస్తూ ఉంటుంది. సైలెంట్ గా తన మాజీ భర్త నాగచైతన్య(Akkineni Naga Chaitanya) పై అప్పుడప్పుడు సెటైర్స్ కూడా పరోక్షంగా వేస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత, ఇప్పుడు మళ్ళీ యాక్టీవ్ అయ్యింది.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
అయితే కాసేపటి క్రితమే ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఫోటో సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. సుహానా అనే అభిమాని తానూ గర్భం దాల్చిన ఒక వీడియో ని షేర్ షేర్ చేస్తూ ‘నేను నా బేబీ..సమంత బేబీ కోసం ప్రొమోషన్స్ చేస్తున్నాము’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో ని చూసి కరిగిపోయిన సమంత, తన స్టోరీ లో షేర్ చేస్తూ ‘క్యూటెస్ట్’ అంటూ లవ్ ఎమోజి తో క్యాప్షన్ పెట్టింది. ఆమె పెట్టిన ఈ స్టోరీ ని సడన్ గా చూసి ఇదేంటి సమంత కి బేబీ బంప్ వచ్చిందా అని కొంతమంది ఆశ్చర్యపోయారు. కానీ విషయాన్ని పూర్తిగా చూసిన తర్వాత అందరికీ అర్థం అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఇన్ని రోజులు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తూ పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సమంత, ఇప్పుడు నిర్మాతగా మారి ‘శుభమ్’ అనే చిత్రం చేసింది.
మరో మూడు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రొమోషన్స్ లో సమంత ఫుల్ బిజీ అయ్యింది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘నేను వైజాగ్ లో ఇప్పటి వరకు మజిలీ, ఓ బేబీ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వచ్చాను. ఇప్పుడు ‘శుభమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఇక్కడికే వచ్చాను. ఆ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో, ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని, సెటిమెంట్ కలిసొస్తుందని అనుకుంటున్నాను’ అంటూ సమంత చెప్పుకొచ్చింది. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ గా ఎన్నో విజయాలను చూసిన సమంత, నిర్మాతగా కూడా సక్సెస్ ని చూస్తుందో లేదో చూడాలి.
Also Read : నాగ చైతన్య సినిమాని ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది : సమంత