Pawan Kalyan and Mohanlal : టాలీవుడ్ లో ఇండస్ట్రీ ని షేక్ చేసిన సూపర్ హిట్స్ ని మిస్ చేసుకున్న హీరోల లిస్ట్ తీస్తే, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పేరు మొదటి స్థానం లో నిలుస్తుంది. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలను ఇతర హీరోలు చేసి పెద్ద సూపర్ స్టార్స్ గా మారిపోయారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత రాజమౌళి తో చేసే సినిమా అవకాశాన్ని కూడా వదిలేసుకున్నాడు. అభిమానులు సోషల్ మీడియా లో అప్పుడప్పుడు ఇలాంటివి తలచుకొని బాధపడుతూ ఉంటారు. కేవలం సినిమాలను వదులుకోవడమే కాదు, ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ ని కూడా ఆయన మిస్ అయ్యాడు. అలా మిస్ అయిన కాంబినేషన్స్ లో ఒకటి మోహన్ లాల్(Mohanlal) తో మల్టీ స్టార్రర్ చిత్రం. రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ అప్పుడే అడుగుపెట్టాడు. కానీ సినిమాలు మాత్రం రెగ్యులర్ గా చేస్తూ ఉండేవాడు.
Also Read : అభిమానికి సెల్ఫీ ఇవ్వడానికి నిరాకరించిన అల్లు అర్జున్..వీడియో వైరల్!
‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్ మొదలు కాకముందు, ‘హరి హర వీరమల్లు’ నిర్మాత AM రత్నం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. ఈ చిత్రానికి తమిళం డైరెక్టర్ నేసన్ దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. ఆయన తమిళం లో మోహన్ లాల్, విజయ్ కాంబినేషన్ లో ‘జిల్లా’ అనే చిత్రాన్ని చేశాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిల్చింది. ఇదే చిత్రాన్ని తెలుగు లో పవన్ కళ్యాణ్, మోహన్ లాల్ కాంబినేషన్ లో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఓకే చేసినప్పుడు, అతని సన్నిహితులు ఇది మన తెలుగు లో వర్కౌట్ అయ్యే సినిమా కాదని చెప్పడం తో, ఈ చిత్రాన్ని చేసే ఆలోచనను విరమించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒకవేళ చేసి ఉండుంటే కచ్చితంగా మిశ్రమ స్పందనే వచ్చేది ఏమో.
కానీ మోహన్ లాల్ లాంటి లెజెండ్ తో తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ని షేర్ చేసుకున్నాడు అనే తృప్తి అభిమానుల్లో ఉండేది. ఇక ఇదే మోహన్ లాల్ కొన్నాళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘జనతా గ్యారేజ్’ చిత్రం చేశాడు. ఈ చిత్రం కమర్షియల్ గా ఆ రోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మోహన్ లాల్ మళ్ళీ తెలుగులో సినిమాలు చేయలేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతుంది. నేటితో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి అయ్యాయి. రేపు , ఎల్లుండి చిన్నపాటి ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ నెల 30న కానీ, లేకపోతే వచ్చే నెల 12న కానీ ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Also Read : నా సినిమాతో పోలికనా?’..చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పై మోహన్ లాల్ రియాక్షన్!