Homeఎంటర్టైన్మెంట్Samantha: ఈ మూవీ కోసమేనా సమంత త్వరలో ముంబై కి షిఫ్ట్ అవ్వనుంది...

Samantha: ఈ మూవీ కోసమేనా సమంత త్వరలో ముంబై కి షిఫ్ట్ అవ్వనుంది…

Samantha: ఇటీవల వార్తల్లో, సోషల్ మీడియా లో వినిపించే పేరు సమంత ఎక్కడికి వెళ్ళినా మీడియా తన చుట్టు తిరుగుతుంది. అక్కినేని నాగ చైతన్య తో విడాకుల ప్రకటనకు ముందు , ప్రకటన తర్వాత కూడా … సామ్ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే సమంత… తనపై వస్తున్న రూమర్లకు తనదైన శైలిలో స్పందిస్తూ మండిపడ్డ విషయం తెలిసిందే.

samantha-planning-to-shift-mumbai-for-a-movie

అయితే తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన మకాం కొంతకాలం ముంబైకి మార్చునుందా… అనే వార్తలు వస్తున్నాయి. ఆమె జీవితంలో వ్యక్తిగతంగా జరిగిన విషయాలను పుల్ స్టాప్ పెట్టి, నటన పై దృష్టి పెట్టాలనుకుంటున్నారు సమంత. ప్రస్తుతం తెలుగులో శాకుంతలం సినిమా కంప్లీట్ చేశారు. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ లో విలక్షణమైన పాత్రలో నటించి మెప్పించింది సమంత. ఈ పాత్రకు గాను ప్రశంసలు కూడా అందుకున్నారు సమంత. ఈ వెబ్ సిరీస్ తర్వాత బాలీవుడ్ లో సమంతకు క్రేజ్ పెరిగింది. ఈ కారణంతోనే  సమంతకు ఓ బాలీవుడ్ సినిమా సైన్ చేశారని సమాచారం. బాలీవుడ్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు అని సమంతకు మరిన్ని హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.

ఎటువంటి విలక్షణమైన పాత్రలోనైనా … తన నటనను ప్రదర్శించాలని సామ్ ఆలోచనలో ఊన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార కూడా మరో హీరోయిన్ గా చేస్తుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version