Viral Video: అయ్యో ‘ఫాఫం’.. అచ్చెన్నా.. ఎంత పనైందన్నా?

TDP Acham Naidu : రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ బుక్ కాకూడదో కూడా తెలిసినవాడే అసలైన నేత అంటారు. కానీ ఇప్పుడు నేతలు బుక్కై సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. శ్రీకాకుళంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో పాపం అచ్చెన్నకు శృంగభంగమైంది. ఆయన తన అన్నకుమారుడు ఎంపీ రామ్మోహన్ రావుతో కలిసి పాల్గొన్న ఈ […]

Written By: NARESH, Updated On : October 13, 2021 4:00 pm
Follow us on

TDP Acham Naidu : రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ బుక్ కాకూడదో కూడా తెలిసినవాడే అసలైన నేత అంటారు. కానీ ఇప్పుడు నేతలు బుక్కై సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు.

tdp achennaidu

శ్రీకాకుళంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో పాపం అచ్చెన్నకు శృంగభంగమైంది. ఆయన తన అన్నకుమారుడు ఎంపీ రామ్మోహన్ రావుతో కలిసి పాల్గొన్న ఈ సభలో సోఫాలో కూర్చుండబోతూ కూలబడిపోయాడు. సోఫా విరగడంతో అబ్బాయి, బాబాయి ఇద్దరూ వెనక్కి పడిపోయారు.

ఈ హఠాత్ పరిణామానికి ఖంగుతిన్న వెనుకున్న వారు వారిద్దరిని పైకి లేపారు. కాస్త తేరుకున్న ఇద్దరూ గాయాలు కాకపోవడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. అచ్చెన్నాయుడిది హెవీ బాడీ.. భారీ ఆకారం.. అంత పెద్ద శరీరంను తట్టుకోవాలంటే కాస్త అయినా గట్టి సోఫా కావాలి. కానీ నిర్వహకులు ఏం వేశారో తెలియదు కానీ కూర్చోగానే టపీమని కూలిపోయింది.

ప్రస్తుతం అచ్చెన్నాయుడు సోఫాలో కూర్చుంటుండగా పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ట్రోల్స్ మీమ్స్ చేస్తూ నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. మీరూ చూడండి ఆ ఫన్నీ వీడియోను…