Vijay Deverakonda : మరో మూడు రోజుల్లో తెలుగు, తమిళం , హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న రెట్రో(Retro Movie) మూవీ కి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ముఖ్య అతిథి గా విచ్చేశాడు. విజయ్ ప్రసంగాలకు యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒక విధమైన యాటిట్యూడ్ తో ఆయన మాట్లాడే తీరు లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. కొన్ని కొన్ని సార్లు వివాదాస్పదంగా మారుతాయి కూడా. ఇప్పుడు అదే జరిగింది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కాశ్మీర్ లో జరిగిన ఘటన గురించి చాలా తీవ్రంగా స్పందించాడు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అందరూ అందుకు మెచ్చుకున్నారు కూడా.
Also Read : విజయ్ దేవరకొండ బైక్ ఎక్కిన నాని… వివాదాలకు ఇలా చెక్ పెట్టారా?
చదువు ప్రాధాన్యత గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘టెర్రరిస్ట్ కొడుకులకు కూడా సరైన విద్య చిన్నప్పటి నుండి ఇప్పించలేదు కాబట్టే ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉన్నారు. 500 ఏళ్ళ క్రితం ట్రబుల్స్ విద్వంసం సృష్టించినట్టు, ఇప్పటికీ అలా కామన్ సెన్స్ లేకుండా, బుద్ధి లేకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. స్పీచ్ మొత్తం అదరగొట్టేసాడు కానీ, కేవలం ఈ ఒక్క విషయం దగ్గర మాత్రం దొరికేసాడు. కచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అంటూ ఇప్పుడు డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి. ఆదివాసీ గిరిజన సమాజాన్ని అవమానించేలా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఉన్నాయని, వారి మనోభావాలు దెబ్బ తీశాయని, మన్యం జిల్లా ఆదివాసీ JAC నాయకులూ నేడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ టెర్రరిస్టుల గురించి మాట్లాడుతూ, అందులోకి గిరిజినాలను కలపడం దారుణమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. యువత కేరింతలు కొడుతున్నారని, ఉపన్యాసాల్లో ఏది పడితే అది మాట్లాడకూడదు. స్థితిగతులను తెలుసుకొని మాత్రమే వ్యాఖ్యానించారు. తక్షణమే విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలని JAC డిమాండ్ చేసింది.
మరి విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్తాడా లేదా?, కనీసం రెస్పాన్స్ అయినా ఇస్తాడా అని ఇప్పుడు సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ కి సంబంధించిన మొదటి పాట ప్రోమో వీడియో ని రేపు విడుదల చేయబోతున్నట్టు నిన్న అధికారిక ప్రకటన చేసారు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రం పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. అనిరుద్ రవించంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ వీడియో కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. మే30 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతమేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Also Read : హే ఏంటి ఇంత ఛేంజ్.. మెడలో రుద్రాక్ష, కాషాయ వస్త్రాలు.. మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ