Homeఎంటర్టైన్మెంట్Samantha Naga Chaitanya: సమంత - నాగచైతన్య విడాకులపై క్లారిటీ.. ముహూర్తం ఎప్పుడంటే?

Samantha Naga Chaitanya: సమంత – నాగచైతన్య విడాకులపై క్లారిటీ.. ముహూర్తం ఎప్పుడంటే?

సమంత.. సోషల్ మీడియాలో ఇటీవల బాగా ట్రెండ్ అవుతున్న పేరు. అక్కినేని వారి ఇంట కాలుమోపిన తర్వాత ఆమె ఫెయితే మారిపోయిందని అనిపించింది. నాగ చైతన్య, సమంత జంటను చూసి టాలీవుడ్లో మరో జంట స్థిరపడిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ.. కొందరు మాత్రం ఇది ఎంతోకాలం సాగే ప్రయాణం కాదని వ్యాఖ్యానించారు. ఇటీవలే వీరిద్దరి ప్రవర్తనపై కామెంట్ల వర్షం కురుస్తోంది.

Samantha Naga Chaitanya

అక్కినేని జోడీ నాగచైతన్య-సమంత గురించి గత కొద్దిరోజులుగా పలు వార్తలు వస్తున్నాయి. ఈ హిట్ జోడి ఫట్ అవుతుందని.. వారిద్దరు విడిపోతారని.. ఇలా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో చై- సామ్ జోడీ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సమంత తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అక్కినేని పేరు తొల‌గించినప్పటి నుండి అభిమానుల‌లో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రి గురించి ఎన్నో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్న‌ప్ప‌టికీ సామ్ నుంచి కానీ.. చైతూ నుంచి కానీ ఎలాంటి స్పంద‌న లేదు.

నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ప్రశంసలు కురిపించారు. సినిమా సూపర్ హిట్ అని కామెంట్ చేస్తున్నారు. అయితే.. ఇదే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా చైతూ ఓ ట్వీట్‌ చేశాడు. దానికి సమంత స్పందించింది. చైతూ ట్వీట్‌ని షేర్ చేస్తూ విన్నర్ అంటూ.. చిత్ర బృందానికి, సాయి పల్లవికి కంగ్రాట్స్ చెప్పింది. వెంటనే చైతూ దానికి రిప్లై ఇచ్చేశాడు. ‘థ్యాంక్స్ సామ్’ అంటూ.. మెస్సేజ్ చేశాడు. సమంత- చైతూ జంట బాగానే ఉన్నారని, వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని అందరూ భావించారు. కానీ.. సోషల్ మీడియా కామెంట్ల వర్షం మాత్రం ఆగలేదు.

అక్కినేని జంటపై వస్తున్న రూమర్లపై సమంత కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సమంత సొంత దుస్తుల బ్రాండ్‌ ‘సాకి’ ఏర్పాటు చేసి మంగళవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంత చిన్నపాటి వేడుకలు నిర్వహించింది. అలాగే ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తానని ముందస్తుగానే ఓ పోస్ట్‌ చేసింది. చెప్పినట్లుగానే అభిమానులు అడిగిన ప్రశ్నకు ఓపికతో బదులిచ్చింది.

ఓ అభిమాని.. ‘మీరు నిజంగా ముంబయికి వెళ్తున్నారా.?’ అంటూ ప్రశ్నించారు. దీనిపై కాస్త ఓపికగా సమాధానం చెప్పింది సామ్. ఒకప్పటిలా ఆగ్రహంతో కాకుండా ఆలోనతో స్పందించింది. ‘అసలు ఈ రూమర్‌ ఎక్కడ మొదలైందో తెలియడం లేదు. కానీ వందల రూమర్లలాగే ఇది కూడా ఒక రూమర్‌ మాత్రమే. హైదరాబాదే నా ఇల్లు. హైదరాబాద్‌ నాకు అన్నీ ఇస్తోంది, నేను ఇక్కడే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సామ్‌చైల వైవాహిక జీవితంపై వస్తోన్న పుకార్లకు చెక్‌ పడినట్లు అయ్యిందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

సమంత, నాగచైతన్యల పెళ్లి రోజైన అక్టోబర్‌ 7 దగ్గరలోనే ఉంది. ఆ రోజున ఇద్దరూ దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెబుతారని ఫ్యాన్స్ లో ప్రచారం జరుగుతోంది. తమ బంధం గురించి అసలు ఎందుకింత శ్రద్ధ అని సమంత ఇప్పటికే పలుసార్లు చెప్పింది. పెళ్లిరోజును కలిసి చేసుకుంటారా? లేక అప్పుడు కూడా ఇదే దూరం పాటిస్తారా అనేదానిపై చర్చ జరుగుతోంది. 7వ తేదీన అయినా.. దీనిపై ఇద్దరూ స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే…

సోష‌ల్ మీడియా క్వీన్ స‌మంత త‌మ‌పై వ‌చ్చే పుకార్లుకు పరోక్షంగా స్పందించింది. మీడియా, రియాలిటీ మ‌ధ్య వ్య‌త్యాసాన్ని చూపిస్తూ.. మేమిద్దరం బాగానే ఉన్నాం. మీడియానే దానిని పెద్దది చేసి చూపిస్తుంది అన్న‌ట్టుగా త‌న ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. ఇటీవ‌ల నాగ్ బ‌ర్త్ డే రోజు కూడా సమంత చాలా ప్రేమ‌గా త‌న మామ‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది. అయిన‌ప్ప‌టికీ పుకార్ల‌కి బ్రేక్ ప‌డ‌లేదు. స‌మంత డైరెక్ట్‌గా ఈ విష‌యంపై వివ‌ర‌ణ ఇస్తే కానీ పుకార్ల‌కి పులిస్టాప్ ప‌డేలా క‌నిపించ‌డం లేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular