రాజకీయాలని వెడిక్కిస్తున్న. హుజురాబాద్ ఉప ఎన్నిక కి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది… యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ ఎన్నికల మీదనే దృష్టి పెట్టింది.. ఇప్పటికే టిఆర్ఎస్ అభ్యర్థి గా గెల్లు శ్రీనివాస్,బిజేపి అభ్యర్థి గా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలొ ఉన్నారు…ఇప్పటికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నది హట్ టాఫిక్ గా మారింది…… రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీలొ జోష్ పెరుగగా రెండు రోజులలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించనున్న నేపధ్యంలో ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది.

ఉభయ రాష్ట్రాలలో హాట్ టాఫిక్ మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక కి రంగం సిద్ధం అయ్యి ఎన్నికల నగారా మోగింది….ఇప్పటికే టిఆర్ఎస్ మరియు బిజేపి అభ్యర్థులు ఖరారు కాగా,జాతీయ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది.. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పిసిసి ఎన్నికల కార్య నిర్వహణ కమిటి ఛైర్మన్ దామేదర నరసింహ కి అప్పజెప్పగా,కాంగ్రెస్ తరుపున హుజురాబాద్ లో పోటి చేసేందుకు దరాఖాస్తు చేసుకొవాలని తెలపడం తో పందొమ్మిది మంది హుజురాబాద్ ఎన్నికలలో అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు.. పందొమ్మిది మందిలొ నలుగురి పేర్లని ఖరారు చేసి ఏఐసిసికి పంపింది….గురువారం భూపాలపల్లి లో ఆబ్యర్థి పేరుని ప్రకటించే అవకాశం వున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం రెండు కమిటిలు సిధ్దం చేశాయి…పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటి ఛైర్మన్.దామోదర రాజనర్సిం ఒక కమిటి ,సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మరో కమిటి అభ్యర్థి పేరుని ఖరారు చేసి ఏఐసిసికి అందించనున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి గా కొండ సురేఖ పేరు దాదాపుగా ఖరారు అయ్యినట్లు ఊహగానాలు వచ్చాయి…బిజేపి,టిఆర్ఎస్ ని ఢీ కొట్టాలంటే హుజురాబాద్ నియోజకవర్గం లో కొండ సురేఖ నే బలమైన అభ్యర్థి అని కాంగ్రెస్ భావిస్తోంది…. హుజురాబాద్ లొ కాంగ్రెస్ అభ్యర్థి పోటి చేసేందుకు కొండా సురేఖ ని గాంధీ భవన్ కి పిలిపించుకొని ఏఐసిసి ఇంచార్జ్ మణికం టాగూర్ మాట్లాడగా తనకి వచ్చే ఎన్నికలలో రెండు టిక్కెట్లు కావాలని డిమాండ్ చేసినట్లు,దానికి ఒప్పుకుంటే హుజురాబాద్ లో పోటి చేస్తానని తెలిపినట్లు సమాచారం.
కొండ సురేఖ వరంగల్ జిల్లాకి చెందిన నేత కావడం తో స్థానికేతరురాలు అనే ఫీలింగ్ వస్తుందని,కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం నకి చెందిన పత్తి కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పెర్లని,కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గా కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లని కూడా పరిశీలిస్తున్నారు….. సత్యనారాయణ ఎస్సి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ,రెడ్డి సామాజిక వర్గం నుండి కృష్ణారెడ్డి, బిసి సామాజిక వర్గానికి చెందిన కొండ సురేఖ, ప్యాట రమేష్ రేసులో ఉండగా నలుగురిలొ ఎవరొ ఒకరు పైనల్ చేస్తారని కొండ సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ మరియు లోకల్ క్యాండెట్ ని పరిగణనలొకి తీసుకుంటె కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేరులు ప్రధానంగా వినబడుతున్నాయి…భూపాలపల్లిసభలో ఈ నలుగురిలొ ఒకరిని కాంగ్రెస్ అభ్యర్థి గా ప్రకటించి వీలైనంత త్వరగా జనాల్లోకి వెళ్ళాలని కాంగ్రెస్ భావిస్తోంది.