Death Certificate Ad: సామాజిక మాధ్యమాల పుణ్యమాని లోకంలో కొత్త పోకడలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కొత్త కొత్త విషయాలు వైరల్ అవుతున్నాయి. వింత సంఘటనలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇటీవల అస్సాంలో ఓ దినపత్రిలో ఇచ్చిన ప్రకటన అందరిలో ఆశ్చర్యానికి గురి చేసింది. దాన్ని సాక్షాత్తు ఐపీఎస్ ఆఫీసరే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం సంచలనం కలిగించింది. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలిస్తే షాకే. తన డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ ఓ బాధితుడు పేపర్ లో యాడ్ ఇవ్వడం వివాదానికి తెరలేపింది.

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు లోకంలో పోకడలు మారుతున్నాయి. పుర్రెకో గుణం జిహ్వకో రుచి అన్నట్లు అతడి డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ అతడే స్వయంగా ప్రకటన ఇవ్వడంతో అందరు అవాక్కయ్యారు. తన మరణ ధృవీకరణ పత్రం పోయిందంటూ అతడే యాడ్ ఇచ్చుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అతడు చేసిన పనికి సోషల్ మీడియాలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ అతడు స్వయంగా ప్రకటన ఇవ్వడం అందరిలో పలు ప్రశ్నలు రావడానికి కారణమైంది.
ఇండియాలో మాత్రమే ఇలాంటివి జరగడం మామూలే అని ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించారు. తన డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ యాడ్ ఇవ్వడంతో నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంతకీ డెత్ సర్టిఫికెట్ దొరికితే ఎక్కడకు తెచ్చి ఇవ్వాలి? స్వర్గానికా? నరకానికా? అని సెటైర్లు వేస్తున్నారు. తన మరణ ధృవీకరణ పత్రం పోయిందంటూ ప్రకటన ఇవ్వడం కొత్తగా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు.

దేశంలో ఏది చేసినా సంచలనమే. సాఫీగా కొందరు మాత్రమే చేస్తారు. కొందరే ఇలా వంకరలుగా చేయడంలో ఆరితేరుతారు. ఇంకో వ్యక్తి తన పెళ్లి కార్డును ముద్రించడంలో కొత్తదనం చూపాడు. ఇప్పటికే ఏపీలో ఓ పవన్ కల్యాణ్ అభిమాని పవన్ ఫొటోలతో పెళ్లి కార్డును ముద్రించి అందరిలో ఆలోచనలు పెంచాడు. తన పెళ్లి కార్డును ఓ బ్యాలెట్ పిట్ పై ముద్రించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. నెటిజన్లు మాత్రం ఇలాంటి వారికి పలు ప్రశ్నలు వేస్తున్నారు. మీకు ఆలోచనలు ఎలా వస్తున్నాయని అడుగుతున్నారు. వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందట. అందులో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి వీరు చేస్తున్న పనులే విచిత్రంగా ఉంటున్నాయి. ఎదుటి వారికి పలు ప్రశ్నలు వచ్చేలా చేస్తున్నాయి. వారి మదిలో మెరిసిన ఆలోచనలకు కార్యరూపం ఇస్తున్నారు. కానీ ఎదుటి వారిని ఇబ్బందులకు గురిచేస్తారనే విషయం తెలియడం లేదా అని అడుగుతున్నారు. ఒకరేమో డెత్ సర్టిఫికెట్ పోయిందని, మరొకరేమో వెడ్డింగ్ కార్డుల ముద్రణలో వింతవింత ఆలోచనలకు ఉపక్రమించడం నిజంగా ఆందోళనకరమే.