Samantha : గత కొంతకాలంగా సమంత(Samantha Ruth Prabhu) ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో ప్రేమాయణం నడుపుతుందని, వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా వీళ్లిద్దరు జంటగా కనిపించడమే అందుకు కారణం. రీసెంట్ గా సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలలో కూడా రాజ్ నిడిమోరు ఉన్నాడు. అతని భుజం పై తన తలని వాల్చుకొని సమంత దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరి ఇంట్లో పెళ్ళికి కూడా ఒప్పేసుకున్నారని, ఈ ఏడాదిలోనే మూడు మూళ్ళ బంధం తో ఒక్కటి కాబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. సమంత కూడా ఇన్ని రోజులు ఈ వ్యాఖ్యలపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇవి పుకార్లు కూడా నిజమే అని అంతా నమ్మారు. అయితే ఈ వ్యాఖ్యలపై రీసెంట్ గానే సమంత మ్యానేజర్ ఇచ్చిన రెస్పాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read : సమంతపై రాజ్ నిడిమోరు భార్య సంచలన వ్యాఖ్యలు..పోస్ట్ వైరల్.. ఆమె ఎవరో తెలుసా?
ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అవన్నీ రూమర్స్’ అంటూ తేల్చేసాడు. సమంత రీసెంట్ గానే నిర్మాతగా ‘శుభమ్’ అనే చిత్రంతో మన ముందుకొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. సమంత కు నిర్మాతగా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరిస్తే, రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఆ సినిమా నిర్మాణం లో రాజ్ కి కూడా భాగం ఉంది కాబట్టే సమంత తో ఇటీవల కాలంలో ఎక్కువగా తిరుగుతూ కనిపించాడు అంటూ చెప్పుకొస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. అయితే సెలబ్రిటీలు ఒక్కోసారి ఇలాంటివి గోప్యంగా ఉంచేందుకే ప్రయత్నం చేస్తారని, పొరపాటున సోషల్ మీడియా లో లీకై జనాలు దానిని నమ్మితే ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నందున తమ పీఆర్ టీం తో అవి కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పిస్తుంటారని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు కూడా మా మధ్య ఏమి లేదని చెప్తూనే, ఒకరోజు వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకొని అందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. త్వరలోనే వీళ్లిద్దరు ఒక బిడ్డకు కూడా జన్మని ఇవ్వబోతున్నారు. నాగ చైతన్య, శోభిత లు కూడా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు. అనేక సందర్భాల్లో నాగ చైతన్య ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసాడు. కానీ ఆయన కూడా శోభిత ని పెళ్ళాడి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. సమంత కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని, త్వరలోనే వీళ్లిద్దరు కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం సమంత ‘శుభమ్’ మూవీ సక్సెస్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తుంది. శారీరకంగా, మానసికంగా ఎంతో చితికి పోయిన తర్వాత సమంత కి కెరీర్ పరంగా దక్కిన మొట్టమొదటి సక్సెస్ ఇది.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!