Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య గా రేణు దేశాయ్ సోషల్ మీడియా లో బాగా పాపులర్ అనే విషయం తెలిసిందే. పైగా ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు అకిరా నందన్ మరియు ఆద్య కి సంబంధించిన విషయాలను కూడా తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో చాలా తేడాగా ప్రవర్తిస్తుంది.
పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే చాలు మండిపడిపోతుంది. రీసెంట్ గానే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇంస్టాగ్రామ్ లో మా అన్న కొడుకుని ఒకసారి చూపించండి మేడం అని అడిగినందుకు, అతనిని ఇష్టమొచ్చినట్టు తిట్టేసింది.మీ అన్న కొడుకు ఏమిటి..? , అతను నా కొడుకు, దయచేసి నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి వచ్చి ఇలాంటి కామెంట్స్ చెయ్యకండి అంటూ విరుచుకుపడింది.
పైన అభిమాని అడిగిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు, కానీ ఆమె ఎందుకు అలా రియాక్ట్ అయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు.కానీ ఈరోజు ఆమె తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన వీడియో చూస్తూ ఉంటే, ఈమె పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది.’కమింగ్ సూన్’ అంటూ ఆమె లేటెస్ట్ గా చేసిన ఇంటర్వ్యూ కి సంబంధించిన చిన్న ఎడిటింగ్ వీడియో ని అప్లోడ్ చేసింది, ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి,పవన్ కళ్యాణ్ ఇమేజి కి దెబ్బ తీసే విధమైన కామెంట్స్ చెయ్యడానికే ఆమె సరిగ్గా సమయం చూసుకొని ఎన్నికల సమయం లోనే ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తుంది అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరి రేణు దేశాయ్ ఈ ఇంటర్వ్యూస్ లో ఎలాంటి విషయాల గురించి మాట్లాడబోతుందో చూడాలి.