https://oktelugu.com/

బిగ్ బాస్-4లోకి సమంత.. నాగ్ పై ఒత్తిడి పెంచిందా?

బిగ్ బాస్-4 సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ ఎనిమిది వారాలను పూర్తి చేసుకొంది. ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం రసవత్తరంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్లు హౌస్ లో ఉండేందుకే పోటీ పడుతుండటంతో గేమ్ ఆసక్తికరంగా మారింది. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు టీవీలకు అతుక్కుపోతున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఇదిలా ఉంటే బిగ్ బాస్-4 సీజన్ కు హోస్టుగా చేస్తున్న నాగార్జున తన ‘వైల్డ్ డాగ్’ మూవీ షూటింగు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 04:34 PM IST
    Follow us on

    బిగ్ బాస్-4 సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ ఎనిమిది వారాలను పూర్తి చేసుకొంది. ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం రసవత్తరంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్లు హౌస్ లో ఉండేందుకే పోటీ పడుతుండటంతో గేమ్ ఆసక్తికరంగా మారింది. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు టీవీలకు అతుక్కుపోతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఇదిలా ఉంటే బిగ్ బాస్-4 సీజన్ కు హోస్టుగా చేస్తున్న నాగార్జున తన ‘వైల్డ్ డాగ్’ మూవీ షూటింగు కోసం కులుమానాలి వెళ్లాడు. 21రోజులపాటు షూటింగ్ ఉండటంతో నాగార్జున అక్కడే ఉండాల్సి వస్తోంది. దీంతో కిందటివారం నాగార్జున ప్లేస్ లో ఆయన కోడలు సమంత హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. సమంత ఎంట్రీతో బిగ్ బాస్ షోకు కొత్త కళ వచ్చింది.

    Also Read: రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ పోస్టు.. పునర్నవి గురించేనా?

    దసరా సందర్భంగా ‘బిగ్ బాస్-4’ నిర్వాహాకులు స్పెషల్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హోస్ట్ గా సమంత చేసి బిగ్ బాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. నాగార్జున తనకు ఇచ్చిన బాధ్యతను సమంత సమర్థవంతంగా నిర్వహించింది. సమంత ఎంట్రీతో బిగ్ బాస్ షోకు టీఆర్పీ కూడా బాగానే వచ్చింది. దీంతో ఈ వారం కూడా సమంతనే హోస్ట్ గా పంపించాలని నాగార్జున భావించాడు.

    అయితే సమంత మాత్రం ఇందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. కిందటి వారం ఆమె హోస్ట్ చేసినపుడు తెలుగు సరిగా మాట్లాడలేక చాలా ఇబ్బందిపడింది. దీంతోపాటు ఆమె బిజీగా షెడ్యూల్ కారణంగా రోజు బిగ్ బాస్ షోను చూడలేకపోతుందట. షో చూడకుండా కంటెస్టుల గురించి మాట్లాడటం బాగోదని సమంత హోస్ట్ చేయనని చెప్పిందని సమాచారం.

    Also Read: రేటింగ్స్ పడిపోతుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు?

    సమంత నిర్ణయంపై నాగార్జున తాజా చిత్రంపై ఒత్తిడి పెరిగిందట. త్వరగా షూటింగ్ కాంప్లీట్ చేసి హైదరాబాద్ వెళ్లాలని నాగార్జున భావిస్తున్నాడు. దీంతో రోజుకు 8గంటలు షూటింగులో పాల్గొనే నాగార్జున ప్రస్తుతం 12గంటలు చేస్తున్నాడట. అయితే ఈ వారం నాగార్జున హోస్ట్ చేస్తాడా లేక సమంత చేస్తుందా? అనేది మాత్రం తేలాల్సి ఉంది.