https://oktelugu.com/

Samantha: సమంత ఇన్ స్టాగ్రాం ఆదాయం అంతనా?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఒంట్లో సత్తువ, గ్లామర్ ఉండగానే.. నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి.. ఇప్పుడు ఈ పాలసీని అక్షరాల పాటిస్తోంది అక్కినేని వారి కోడలు సమంత.. పెళ్లి అయినా కూడా గ్లామర్ డోసును ఏమాత్రం తగ్గించకుండా అంతకుమించిన రోమాన్స్ చేస్తున్న ఈ భామ ఆదాయం కూడా అంతే రేంజ్ లో సంపాదిస్తుండడం విశేషం. తాజాగా సెలబ్రెటీలు చాలా మంది ఇన్ స్టాగ్రామ్ పోస్టులతో ఆదాయం పెంచుకుంటున్నారంటూ గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. టీమిండియా కెప్టెన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2021 / 11:23 AM IST
    Follow us on

    దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఒంట్లో సత్తువ, గ్లామర్ ఉండగానే.. నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి.. ఇప్పుడు ఈ పాలసీని అక్షరాల పాటిస్తోంది అక్కినేని వారి కోడలు సమంత.. పెళ్లి అయినా కూడా గ్లామర్ డోసును ఏమాత్రం తగ్గించకుండా అంతకుమించిన రోమాన్స్ చేస్తున్న ఈ భామ ఆదాయం కూడా అంతే రేంజ్ లో సంపాదిస్తుండడం విశేషం.

    తాజాగా సెలబ్రెటీలు చాలా మంది ఇన్ స్టాగ్రామ్ పోస్టులతో ఆదాయం పెంచుకుంటున్నారంటూ గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాలు ఇన్ స్టాగ్రామ్ ఆదాయంలో ముందున్నారని గణాంకాలు వెల్లడయ్యాయి.

    దక్షిణాది, హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి అగ్రతారగా వెలుగొందుతున్న సమంత ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోనూ సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే 18 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

    18 మిలియన్ల ఫాలోవర్స్ ఉండడంతో ఇప్పుడు పలు కంపెనీలు తమ బ్రాండ్లకు ప్రచారం చేయాలంటూ సమంత వద్దకు క్యూ కడుతున్నాయట.. ఇందుకు తగ్గట్టుగానే భారీ రెమ్యూనరేషన్ ను సమంత అందుకుంటోందట..

    ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు సమంత దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తోందట.. ఇలా దక్షిణాది హీరోయిన్ల అందరిలోకి అత్యధికంగా ఇన్ స్టాగ్రామ్ లో సంపాదిస్తున్న హీరోయిన్ గా సమంత పేరుపొందింది. ఆదాయం వచ్చే దేన్నీ వదిలిపెట్టకుండా సమంత ‘క్యాష్ చేసుకుంటున్న తీరు’ ఆసక్తి రేపుతోంది.