
Samantha Ruth Prabhu : సమంత-నాగ చైతన్య ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. సమంత డెబ్యూ మూవీ ఏమాయ చేసావే. 2010లో ఈ చిత్రం విడుదల కాగా అప్పటి నుండే ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. 2018లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లికి కొన్ని నెలల ముందు మాత్రమే వీరి ఎఫైర్ బయటపడింది. అన్యోన్యంగా జీవిస్తున్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల కాపురం తర్వాత 2021లో అధికారికంగా విడిపోయారు. విడాకుల ప్రకటన చేశారు.
విడాకులకు కారణాలు ఏంటనేది చెప్పలేదు. కేవలం సన్నిహితులు, నాగ చైతన్య, సమంతకు మాత్రమే ఆ నిజం తెలుసు. పలు పుకార్లు మాత్రం తెరపైకి వచ్చాయి. ఈ విడాకుల విషయంలో సమంత అందరి చేత టార్గెట్ చేయబడ్డారు. ఆమె క్యారెక్టర్, బిహేవియర్ ని ఉద్దేశిస్తూ కొన్ని అపవాదులు వినిపించాయి. సమంత ఈ కామెంట్స్ కి హర్ట్ అయ్యారు. నిరాధార మీడియా ప్రసారాల మీద ఫైర్ అయ్యారు. ఆమె కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది.
సమంత కొన్నాళ్ళు డిప్రెషన్ ఎదుర్కున్నారనే వాదన ఉంది. కారణాలు ఏమైనా సమంత-నాగచైతన్య విడిపోయారు. అయితే నాగ చైతన్య జ్ఞాపకాలు కొన్ని ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. సమంత నాగ చైతన్య పేరు తన రిబ్స్ మీద టాటూగా వేయించుకుంది. సమంత ఒంటిపై మొత్తం మూడు టాటూలు ఉండగా… అందులో నాగ చైతన్య అనే పేరు కూడా ఒకటి. ఈ టాటూను సమంత విడాకులు తర్వాత కూడా తొలగించలేదు.

సిటాడెల్ ప్రీమియర్ షో ఈవెంట్ కోసం లండన్ వెళ్లిన సమంత బ్లాక్ ట్రెండీ వేర్ ధరించారు. ఆమె టాప్ బాగా కురచగా ఉంది. దీంతో రిబ్ పై నాగ చైతన్య టాటూ రివీల్ అయ్యింది. ఈ క్రమంలో సమంత ఒంటిపై నాగ చైతన్య జ్ఞాపకం అలానే ఉందని పలువురు అనుకుంటున్నారు. సమంత మాజీ భర్త మీద చాలా కోపంగా ఉన్నారు. ఆమె పలు సందర్భాల్లో పరోక్షంగా తన ఆగ్రహాన్ని భయపెట్టారు. అలాంటప్పుడు ఆ టాటూను ఎందుకు ఉంచుకున్నారనేది ఆసక్తికరం.