Samantha: సమంత ముద్దులిస్తే అక్కినేని ఫ్యాన్స్ కి ఇబ్బందేంటీ!

ఆమె అక్కినేని కోడలు. ఇష్టం వచ్చినట్లు సిల్వర్ స్క్రీన్ పై నటిస్తే కుదరదంటున్నారు. ఆమె బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తే నొచ్చుకుంటున్నారు. సమంత లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ మూవీలో విజయ్ దేవరకొండతో ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Written By: Shiva, Updated On : September 4, 2023 6:17 pm

Samantha

Follow us on

Samantha: సమంత చాలా కాలంగా ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ముఖ్యంగా విడాకుల తర్వాత అక్కినేని ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారనే వాదన ఉంది. విడాకులకు సమంతనే కారణం అంటూ కొన్ని పుకార్లు తెరపైకి వచ్చాయి. ఇవన్నీ వారే ప్రచారం చేయించారని అంటారు. ఇదిలా ఉంటే విడాకులు తీసుకుని తన మానాన తాను బ్రతుకుతున్నా వేధింపులు తప్పడం లేదు. తన లైఫ్ పై కొందరు ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారు.

ఆమె అక్కినేని కోడలు. ఇష్టం వచ్చినట్లు సిల్వర్ స్క్రీన్ పై నటిస్తే కుదరదంటున్నారు. ఆమె బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తే నొచ్చుకుంటున్నారు. సమంత లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ మూవీలో విజయ్ దేవరకొండతో ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల మీద అక్కినేని ఫ్యాన్స్ మండి పడుతున్నారు. శృంగార సన్నివేశాల్లో నటించిన సమంతను తప్పుబడుతున్నారు. ఆమె అక్కినేని ఫ్యామిలీ పరువు తీస్తుందని వాపోతున్నారు.

ఈ విషయంలో సమంత ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలబడతారు. నాగ చైతన్యకు విడాకులు ఇచ్చాక ఆమె అక్కినేని హీరోయిన్ కాదు. కోడలు అసలే కాదు. కాబట్టి ఆమె లైఫ్ ఆమె ఇష్టం. తనకు ఇష్టం వచ్చిన చిత్రాలు, సీన్స్ చేస్తుంది. మీరెందుకు తప్పుబడుతున్నారని వాదిస్తున్నారు. అలా అనుకుంటే నాగ చైతన్య కూడా థాంక్యూ మూవీలో రాశి ఖన్నాతో లిప్ లాక్ సన్నివేశాలు చేశాడు. మరి అది తప్పు కదా. సమంతకు ఒక న్యాయం నాగ చైతన్యకు ఒక న్యాయమా అంటున్నారు.

ఈ రచ్చ కొనసాగుతుంది. అదే సమయంలో సమంత సక్సెస్ చూసి అక్కినేని ఫ్యాన్స్ ఓర్వలేక పోతున్నారని అంటున్నారు. అక్కినేని హీరోల చిత్రాల కంటే సమంత చిత్రాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయని ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత-అక్కినేని ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతుంది. సమంత మాత్రం ఖుషి సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. యూఎస్ లో ఈ చిత్రం వసూళ్ల వరద పారిస్తుంది. ఖుషి చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కించాడు.