Pushpa 2: పుష్ప 2కి 1000 కోట్ల బిజినెస్..? ఏంటి సామీ ఈ క్రేజ్!

పుష్ప 2 హక్కులు ఏకంగా రూ. 1000 కోట్లు పలికాయట. అన్ని భాషల్లో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి మొత్తంగా వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారట. చెప్పాలంటే ఇది రికార్డు బిజినెస్. కారణం.

Written By: Shiva, Updated On : September 4, 2023 5:54 pm

Pushpa 2

Follow us on

Pushpa 2: అల్లు అర్జున్ ఇండియాలోనే క్రేజియస్ట్ హీరోగా ఎదిగాడు. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. ఒకప్పుడు ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో మాత్రమే మార్కెట్ ఉండేది. పుష్ప మూవీతో ఇండియా వైడ్ ఫేమ్ రాబట్టాడు. పాన్ ఇండియా స్టార్ అనే పదానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు. ఉత్తర భారతంలో అల్లు అర్జున్ అంటే పడిసచ్చే ఫ్యాన్స్ ఏర్పడ్డారు. పుష్ప 2 హిందీలో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. దీంతో ఈ చిత్ర హక్కుల కోసం అప్పుడే పోటీ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం విడుదలకు ముందే పుష్ప నిర్మాతలకు వందల కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెట్టనుంది అంటున్నారు.

పుష్ప 2 హక్కులు ఏకంగా రూ. 1000 కోట్లు పలికాయట. అన్ని భాషల్లో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి మొత్తంగా వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారట. చెప్పాలంటే ఇది రికార్డు బిజినెస్. కారణం… పుష్ప 2 బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు అంటే నిర్మాతలకు అదనంగా రూ. 700 కోట్లు దక్కనున్నాయన్న మాట. పుష్ప పార్ట్ 1 లైఫ్ టైం రూ. 360 కోట్ల వసూళ్లు అందుకుంది. అంతకు మూడు రెట్లు బిజినెస్ పుష్ప 2 చేస్తుంది.

మరి ఇదే నిజమైతే అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్ళినట్లు. నెక్స్ట్ మూవీకి ఆయన వంద కోట్లకు పైనే తీసుకుంటారు. పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ రూ. 80 కోట్లు తీసుకున్నారని వినికిడి. ఇటీవల భారత ప్రభుత్వం నేషనల్ అవార్డ్స్ ప్రకటించింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు కొల్లగొట్టాడు. టాలీవుడ్ చరిత్రలో ఆ గౌరవం దక్కిన మొదటి హీరో అల్లు అర్జున్. అందుకే ఈ అవార్డు చాలా ప్రత్యేకం. అలాగే ఇంస్టాగ్రామ్ ఫాలో అవుతున్న ఏకైన ఇండియన్ హీరో అల్లు అర్జున్.

తాజాగా ఆయన మీద ఇంస్టాగ్రామ్ స్పెషల్ వీడియో చేసింది. ఆయన లైఫ్ స్టైల్, పుష్ప మూవీ విశేషాలు షూట్ చేయడం జరిగింది. టాలీవుడ్ హీరోలను చూస్తుంటే గర్వకారణంగా ఉంది. ఒకరికి మించిన ఘనత మరొకరు అందుకుంటున్నారు. ఇక పుష్ప వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే సూచనలు కలవు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఆయన కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు.