https://oktelugu.com/

Sudigali Sudheer On Rashmi: జీవితంలో రష్మీ కంటే ఎవరూ ఎక్కువ కాదు… ఫైనల్లీ ఓపెన్ అయిన సుడిగాలి సుధీర్!

సుధీర్-రష్మీ లవర్స్ అని జనాలు ఫిక్స్ అయ్యారు. అందుకే సుధీర్ కనబడితే ఆటోమేటిక్ గా రష్మీ గురించి అడుగుతారు. అలాగే రష్మీ కనబడితే సుధీర్ ప్రస్తావన వస్తుంది. ఈ మధ్య వీరిద్దరూ బుల్లితెరపై జంటగా కనిపించడం మానేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : September 4, 2023 / 06:38 PM IST

    Sudigali Sudheer On Rashmi

    Follow us on

    Sudigali Sudheer On Rashmi: బుల్లితెర లవ్ బర్డ్స్ ఎవరంటే టక్కున యాంకర్ రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్ పేరు చెబుతారు. అంతగా వీరు పాప్యులర్ అయ్యారు. ఏళ్ల తరబడి వీరి కెమిస్ట్రీ సాగింది. జబర్దస్త్ వేదికగా మొదలైన బంధం ఢీ షోతో మరింత బలపడింది. సుధీర్, రష్మీ కలిసి పలు లవ్ ట్రాక్స్ చేశారు. రొమాంటిక్ సాంగ్స్ లో డాన్స్ చేశారు. రెండుసార్లు ఉత్తుత్తి పెళ్లి కూడా చేసుకున్నారు. మరి ఇంత జరిగాక వాళ్ళ మధ్య ఏం లేదంటే నమ్మడం కష్టమే.

    సుధీర్-రష్మీ లవర్స్ అని జనాలు ఫిక్స్ అయ్యారు. అందుకే సుధీర్ కనబడితే ఆటోమేటిక్ గా రష్మీ గురించి అడుగుతారు. అలాగే రష్మీ కనబడితే సుధీర్ ప్రస్తావన వస్తుంది. ఈ మధ్య వీరిద్దరూ బుల్లితెరపై జంటగా కనిపించడం మానేశారు. సుధీర్ మల్లెమాల సంస్థ నుండి బయటకు వచ్చాక రష్మీ కూడా దూరమైంది. చాలా కాలం తర్వాత ఇద్దరూ ఓ షోలో సందడి చేశారు. ఎప్పటిలాగే ఓ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు.

    గతంలో ఇద్దరూ కలిసి చేసిన సాంగ్స్, రొమాంటిక్ స్కిట్స్ కి సంబంధించిన వీడియోలు స్క్రీన్ పై ప్రదర్శించగా రష్మీ ఎమోషనల్ అయ్యింది. ఆమె కంట్లో నీళ్లు తిరిగాయి. ఇక సుధీర్ మాట్లాడుతూ… రష్మీతో నాది బ్యూటిఫుల్ జర్నీ? అన్నాడు. పక్కనే ఉన్న గెటప్ శ్రీను అందుకుని బ్యూటిఫుల్ జర్నీనా లేక లవ్ జర్నీనా? అని అడిగాడు. మళ్ళీ సుధీర్ మాట్లాడుతూ. రష్మీ చాలా సెన్సిటివ్. బాగా కష్టపడే తత్త్వం ఉన్న అమ్మాయి. రష్మీ కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు, అన్నాడు.

    సుధీర్ కామెంట్స్ వీరి బంధంపై మరోసారి సందేహాలు రేపాయి. స్నేహితులమని చెప్పుకునే సుధీర్, రష్మీ ఒకరి పట్ల ఒకరు చాలా ఎమోషనల్ గా ఉన్నారు. సుధీర్ ఏమో ఆమె ముఖ్యం అంటున్నాడని చర్చ మొదలైంది. ఎప్పుడు అడిగినా మా మధ్య స్నేహానికి మించి మరేం లేదని అంటుంటారు. ఇక వీరిద్దరి వయసు 35 ఏళ్ళు దాటింది. అయినా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఏదో ఒకరోజు మేము పెళ్లి చేసుకుంటున్నాం అని బాంబు పేల్చుతారేమో అనే సందేహాలు ఉన్నాయి.