Samantha
Samantha : సమంత నాగచైతన్య ని చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకోవడం వంటివి ఎంతటి సంచలనం గా మారాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ అంశం పై కొన్ని లక్షల కథనాలు ఇప్పటి వరకు వచ్చి ఉంటాయి. ఇప్పటికీ వీళ్లిద్దరి విడాకుల వ్యవహారం గురించి ప్రతిరోజు ఎదో ఒక కథనం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్న జంట ఇది. అయితే నాగ చైతన్య రీసెంట్ గానే ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ని పెళ్ళాడి జీవితం లో ముందుకెళ్లిన సంగతి తెలిసిందే. మరి సమంత పరిస్థితి ఏమిటి?, జీవితాంతం ఆమె ఇలాగే సోలో గా మిగిలిపోతుందా?, లేకపోతే రెండవ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో అనేకసార్లు సమంత ని ట్యాగ్ చేసి ప్రశ్నించేవాళ్ళు.
రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా కొంతమంది యాంకర్లు ఈ అంశం పై ఆమెని ప్రశ్నించగా, ఆమె దానికి సమాధానం చెప్తూ ‘జీవితాంతం ఇలా ఒంటరిగా అయితే కచ్చితంగా ఉండిపోను, పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. ఇంత కచ్చితంగా చెప్తుందంటే కచ్చితంగా ఆమె ప్రేమలో ఉందా?, లేకపోతే ఇంట్లోనే ఎవరైనా ఆమెకి సంబంధం చూసి పెట్టారా అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తాయి. అయితే బాలీవుడ్ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం ఈమె ప్రముఖ దర్శకుడు రాజు నిడిమోరు తో ప్రేమాయణం నడుపుతున్నట్టు తెలుస్తుంది. రాజు నిడిమోరు సమంత తో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ తీసాడు. ఇందులో ఆమె పోషించిన విలన్ పాత్రకి ఇండియా వైడ్ ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓవర్ నైట్ పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. ఈ సిరీస్ తర్వాత ఆమెంతో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ కూడా ఈయనే చేసాడు.
ఈ సిరీస్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇలా ఈ రెండు వెబ్ సిరీస్ షూటింగ్స్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది అని, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని బాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుస. అయితే రాజు నిడిమోరు కి ఇప్పటికే పెళ్లి అయ్యిందని, కానీ అతను చాలా కాలం నుండి తన భార్య తో సఖ్యతగా లేడనీ, వీళ్లిద్దరు విడిపోబోతున్నారని మరో చర్చ సాగుతుంది. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ని రెండవ పెళ్లి చేసుకుంటాడంటూ ఒక విచిత్రమైన గాసిప్ బాలీవుడ్ మొత్తం చుట్టేస్తోంది. అయితే బాలీవుడ్ అంటేనే గాసిప్స్ ఇండస్ట్రీ. అక్కడ నుండి వచ్చే వార్తలన్నీ గాలి వార్తలే కాబట్టి ఈ వార్తని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సమంత అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.