Brad Hogg
Brad Hogg : టీమిండియా మళ్లీ సారథ్య సమస్య ఎదుర్కొంటోంది. రోహిత్‌శర్మ తప్పుకోవాలన్న ఒత్తిడి పెరుగతోంది. రేసులో బుమ్రా ఉన్నా గాయాల కారణంగా కెప్టెన్ పదవికి ఎంపిక చేయడానికి బీసీసీఐ ఆలోచిస్తోంది. యశశ్వి జైశ్వాల్ ఉన్నా అనుభవం లేదు. ఇలాంటి తరుణంలో ఆసిస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్(Brad Hag) టీమిండియా యువ సంచలనం తిలక్‌వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆటంటే తనకు ఇష్టమని తెలిపారు. టీ20లలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బాటర్‌కు మంచి భవిష్యత్ ఉందని తెలిపాడు. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా తాను తిలక్‌వర్మను ఎంచుకుంటానని వెల్లడించాడు.
ఐపీఎల్‌లో సత్తా…
హైదరాబాదీ స్టార్ తిలక్‌వర్మ అండర్ 19 వరల్డ్ కప్‌లో సత్తా చాటాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగిఒట్టాడు. అరంగేట్రంలోనే అద్బుతాలు చేసిన అతడు టీమిండియా సెలక్టర్లను ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023 ఆటస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. అదే పర్యటనలో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా తరఫున 21 టీ20లు ఆడిన తిలక్‌వర్మ 636 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉఆన్నయి. ఈ రెండూ సౌత్ ఆప్రికాపై చేయడం గమనార్హం. అదీ వరుస మ్యాచ్‌లలో సాధించడం తిలక్ ప్రతిభకు నిదర్శనం. ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడిన తిలక్ 68 పరుగులు చేశాడు దేశవీళీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టుకు తిలక్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌లో బ్యాటర్‌గా సారధిగా సత్తాచాటి ఫైనల్‌కు చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్నాడు. ఇరు జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌వర్మ 16 బంతుల్లో మూడు ఫోర్లతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్వుడ్ బౌలింగ్లో బౌండరీ కొట్టి టీమిండియా విజయం ఖరారు చేశాడు.
కెప్టెన్ కావడం ఖాయం
ఈ తరుణంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తిలక్‌వర్మ గురించి ప్రశంసలు కురిపించాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు కెప్టెన్ అవుతాడని తెలిపాడు. అతను చాలా స్మార్ట్ అని, అతని క్రికెట్ బ్రెయిన్ చాలా సూపర్ అని ప్రశంసించాడు. ఇదే సమయంలో అభిషేక్ శర్మ(Abhishek varma)ను కూడా బ్రాడ్ హాగ్ అభినందించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20లో అభిషేక్ ఆటతీరును అభినందించాడు. కొన్నిసార్లు విఫలమైనా.. కోచ్, కెప్టెన్ మద్దతుతో రాణిస్తున్నాడన్నాడు.