Samantha: సమంత మీడియా పై సీరియస్ అవుతూ కొన్ని చానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. అయితే, ఈ కేసు తీర్పు వచ్చింది. కానీ తీర్పు సమంతకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేసే హక్కు ఛానెల్స్ కు లేదని, కాబట్టి ఆయా యూట్యూబ్ ఛానెల్స్ వెంటనే సమంత పై పెట్టిన అభ్యంతరకర కంటెంట్ ను వెంటనే తీసేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయినా సమంత పరువు నష్టం దావా వేయగానే.. యూట్యూబ్ ఛానెల్స్ ఓనర్లు స్వయంగా ఆమెను రిక్వెస్ట్ చేస్తూ.. ‘మీ పై పెట్టిన ఆ వీడియోలను తొలగిస్తాం అని పబ్లిక్ గా వేడుకున్నారు. అయితే, సమంత మాత్రం ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గలేదు. పైగా వారి పై సీరియస్ అయింది. కానీ చివరకు సాధించింది ఏముంది ? పైగా కోర్టు కూడా వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు అని సామ్ కి కూడా హితవు పలికింది.
అసలు తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత ఫిర్యాదు చేసింది. మరి ఈ తీర్పుతో ఆమెకు వచ్చిన అదనపు గౌరవం ఏముంది ? సామ్ దాఖలు చేసిన పిటిషన్ ను కూకట్‌పల్లి కోర్టు పూర్తిగా విచారించి.. తేల్చింది ఏముంది ? సమాజంలో ఎవరు అయినా ఏ అంశం పైన అయినా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు. అందుకే, ఇలాంటి విషయాల్లో తీర్పులు ఇలాగే ఉంటాయి.
ఇది అర్థం చేసుకోకుండా సమంత అనవసరంగా కోర్టు వరకూ వెళ్ళింది. అయితే రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించారని సమంత తరుపు లాయర్ బలంగా వాదించినా కేసు పూర్తి స్థాయిలో నిలబడలేకపోయింది. చివరకు ఛానళ్ల నిర్వాహకులకు ఎలాంటి నష్టాన్ని కలిగించలేకపోయింది. మహా అయితే, ఆ వీడియో లింకులను తొలగిస్తారు.
కానీ, ఈ వ్యవహారంతో సమంత కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకి అయింది. అయితే వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేయడం కచ్చితంగా తప్పే. అయితే ఇలాంటి సున్నితమైన విషయాలను సున్నితంగా పరిష్కరించుకోవాలి. అనవసరంగా రాద్ధాంతం చేసుకుంటే..నష్టం ఇరువర్గాలకు ఉంటుంది. కాబట్టి, ఇక ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.