
హీరోయిన్ పూజా హెగ్డే, అక్కినేని సమంత మధ్య గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్ నడుస్తోంది. సమంత అందంగా ఉండదని పూజా హెగ్డే తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ కామెంట్ ను చూసిన సమంత ఫ్యాన్స్ పూజాను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. దీనిపై పూజా హెగ్డే స్పందిస్తూ తన సోషల్ మీడియా పేజీని ఎవరో హ్యాక్ చేశారని తెలిపింది. హ్యకర్సే సమంతపై పోస్టు పెట్టి ఉండొచ్చని పూజా వివరణ ఇచ్చినప్పటీ సమంత ఫ్యాన్స్ తగ్గడం లేదు. పూజా హెగ్డే సమంతకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సమంత ఫ్యాన్స్ పూజా హెగ్డే టార్గెట్ చేయడంతో సోషల్ మీడియాలో వీరిద్దరి ఇష్యూ ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది. అయితే ఫ్యాన్స్ ను చల్లబరిచేందుకు సమంత తన ట్వీటర్లో విక్టరీ సింబల్ చూపిస్తూ ఓ పిక్ ను షేర్ చేసింది.
అయితే ఫ్యాన్స్ మాత్రం పూజా హెగ్డే తెలిసి చేసినా.. తెలియక చేసినా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే పూజా హెగ్డే ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు. తన పనేదో చేసుకుంటూ పోతుంది. అయితే తాజాగా సమంత సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని మిమ్మల్నీ విమర్శించే వారికి మీరిచ్చే సమాధానం ఏంటీ అని అడిగాడు. దీనికి సమంత ఇచ్చిన సమాధానం నెటిజన్లు ఆకట్టుకుంటుంది. పూజా హెగ్డేతోపాటు ఆమెను విమర్శించే వాళ్లందరికీ కౌంటర్ ఇచ్చేలా అదిరిపోయే సమాధానం ఇచ్చింది సమంత. ‘తనను ద్వేషించే వాళ్లను చూస్తుంటే తనలో ఇంకా కసి పెరుగుతుందని.. అదే పొగిడితే మాత్రం తాను బద్ధకస్థురాలిగా మారిపోతానని.. అందుకే విమర్శించే వాళ్లే తనకు మేలు చేస్తారని’ సమంత ట్వీట్ చేసింది. తనను విమర్శించేవారి నోళ్లు మూతపడేలా సమంత ఇచ్చిన కౌంటర్ కు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఏది ఏమైనా పూజా ఇష్యూ చాలా తెలివిగా డీల్ చేసిందని నెటిజన్లు సమంతను అభినందిస్తున్నారు.