https://oktelugu.com/

Naga Chaitanya : సమంత ఎఫెక్ట్ : నాగచైతన్యను శోభిత ధూళిపాళ్ల ఎలా చూసుకుంటుందంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 2, 2024 / 11:30 AM IST

    Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అందులో భాగంగానే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ ఎలివేట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్లు కంటిన్యూస్ గా సక్సెస్ లను సాధించడంలో మాత్రం కొంతవరకు వెనకబడిపోతున్నారనే చెప్పాలి…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. నాగేశ్వరరావు, నాగార్జునలు ఎంత మంచి గుర్తింపును సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే. ఇక వీళ్ళ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సైతం సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్య సమంత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్ళ వైవాహిక జీవితం అంత గొప్ప లేకపోవడం తో ఎవరికి వాళ్లు సపరేట్ అయిపోయారు. ఇక దాంతో కొద్ది రోజులుగా సింగిల్ గానే ఉంటున్న నాగచైతన్య మరో హీరోయిన్ అయిన శోభిత దూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడనే విషయం అందరికీ తెలిసింది. ఇక కొద్దిరోజుల క్రితం పెద్దలా సమక్షం లో వాళ్ళ నిశ్చితార్థం కూడా జరిగింది. డిసెంబర్ 4వ తేదీన వాళ్ళ పెళ్లి జరగబోతున్న నేపధ్యం లో ఇప్పుడు శోభిత గురించి పలు రకాల వ్యాఖ్యలైతే వెలువడుతున్నాయి అవి ఏంటి అంటే శోభితా ధూళిపాళ్ల ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి నాగ చైతన్య ను చాలా రెస్పాన్సిబుల్ గా చూసుకోవడమే కాకుండా అన్ని విషయాల్లో తనకు సపోర్టుగా నిలుస్తూ నాగ చైతన్య ను తన కొడుకు మాదిరిగా చూసుకుంటుంది అంటూ కొన్ని కామెంట్లైతే వెలువడుతున్నాయి.

    నిజానికి శోభిత ధూళిపాళ్ల కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ తో పెరిగింది. కాబట్టి బంధాలు, బంధుత్వాలకు విలువనిస్తోంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుంటే ఏది ఏమైనా కూడా నాగచైతన్య తన సెకండ్ వైఫ్ గా శోభిత ధూళిపాళ్ళను ఎంచుకోవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    కారణం ఏంటి అంటే అక్కినేని కుటుంబానికి సరిపడా కోడలు తనే అవుతుంది అంటూ భారీ కామెంట్లు చేయడంతో ప్రస్తుతం అందరి దృష్టి వీళ్ల పెళ్లి పైనే ఉందే. ఇక ఈ నెల నాలుగో తేదీన అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా వీళ్ళ పెళ్లిళ్లు జరిపించాలని నాగార్జున ఇప్పటికి ప్రణాళికలను రూపొందించాడు. ఇక మొత్తానికైతే నాగ చైతన్య అటు వైవాహిక జీవితంలో ఇటు సినిమాలపరంగా ముందుకు దూసుకెళ్లాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని అభిమానులు మొత్తం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ వీళ్ల పెళ్లి ఘనంగా జరపడమే కాకుండా భారీ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి నాగచైతన్య పెళ్లి తర్వాత ఆయన సినిమాల కెరియర్ ఎలా ఉంటుంది అనేది..