Heroine Ileana : పరిశ్రమలో టాలెంట్ కంటే కూడా లక్ ఉన్నోళ్లే ఎక్కువగా రాణిస్తారు. అన్నీ ఉండి కూడా కొందరు నటులు స్టార్స్ కాలేరు. ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేసినా.. బ్రేక్ రాదు. మరికొందరు ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు. ఒకటి రెండు సినిమాలతోనే ఎక్కడ లేని ఫేమ్ తెచ్చుకుంటారు. స్టార్స్ గా పరిశ్రమలో సత్తా చాటుతారు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ హీరోయిన్ ఫస్ట్ మూవీ హిట్. రెండో చిత్రం ఇండస్ట్రీ హిట్. దాంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.
కెరీర్ పీక్స్ లో ఉండగా ఆమె తీసుకున్న నిర్ణయాలు కెరీర్ ని దెబ్బ తీశాయి. పెళ్లి కాకుండానే తల్లి అయిన ఆమె.. ఏకంగా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు … ఇలియానా. ఒక దశలో అబ్బాయిల కలల రాణిగా సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసింది. ఇలియానా గ్లామర్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. దర్శకుడు వైవిఎస్ చౌదరి దేవదాసు చిత్రంతో ఆమెను హీరోయిన్ గా పరిచయం చేశారు. ఈ మూవీ విజయం అందుకుంది. ఇలియానా రెండో చిత్రం పోకిరి.
దర్శకుడు పూరి జగన్నాథ్-మహేష్ బాబు కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం అందుకుంది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. పోకిరి చిత్రంతో ఇలియానా స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ తో ఆమె జతకట్టారు. కెరీర్ పీక్స్ లో ఉండగా ఇలియానా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అది ఇలియానా కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. సౌత్ లో స్టార్ గా ఉన్న ఇలియానాకు బాలీవుడ్ లో పెద్దగా కలిసిరాలేదు. బ్రేక్ ఇచ్చే ఒక్క మూవీ పడలేదు.
సెకండ్ హీరోయిన్ గా ఆమె సెటిల్ అయ్యింది. అదే సమయంలో తెలుగు ప్రేక్షకులు ఆమెను మరచిపోయారు. రీ ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు తెలుగు చిత్రాలు చేసినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. దాంతో బాలీవుడ్ లోనే అడపాదడపా రోల్స్ చేస్తూ ఉండిపోయింది. కాగా ఇలియానా వివాహం చేసుకోకుండానే గర్భం దాల్చింది. అందుకు కారణం ఎవరో కూడా ఆమె చాలా కాలం చెప్పలేదు.
అనంతరం ఆమె ఒక కొడుకుకు జన్మనిచ్చింది. 2023లో ఇలియానా పెళ్లి చేసుకుని తమ బంధాన్ని అధికారికం చేసుకుంది. ఇలియానా భర్త పేరు మైఖేల్ డోలన్. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఆమెకు పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. చెప్పాలంటే ఇలియానా కెరీర్ చివరి దశకు చేరినట్లే..